Hyderabad : హైదరాబాద్ లో రూ.45 లక్షల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత

Hyderabad

Hyderabad News

Hyderabad : అంతరాష్ట్ర డ్రగ్ ఫెడ్లింగ్ రాకెట్ ను చేధించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఎల్బీ నగర్ ఎస్ఒటి, జవహర్ నగర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారని చెప్పారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రూ.45 లక్షల విలువ చేసే గసగసాలు గడ్డి, ఎండిఎంఎ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులు రాజస్థాన్ కు చెందిన ఓం రామ్, సన్వాలా రామ్ గా గుర్తించామని, వికాస్ అనే మధ్యప్రదేశ్ కు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు.

ప్రధాన నిందితులు ఇద్దరు కార్పెంటర్, రెయిలింగ్ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఓం రామ్ పై రాజస్థాన్ లో డ్రగ్స్ కేసులు ఉన్నాయని, ఆర్థిక సమస్యల కారణంగా డ్రగ్స్ విక్రయించడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారని విచారణలో తేలిందనారు. డ్రగ్స్ సప్లై చేసే వికాస్ నుంచి నిందితులు కొనుగోలు చేసి బస్సుల్లో, లారీల్లో ట్రైన్ లలో మధ్యప్రదేశ్ నుంచి నగరానికి తీసుకు వచ్చి విక్రయించేవారి వెల్లడించారు.

పక్కా సమాచారంతో ఎస్ఒటి ఎల్బీ నగర్ బృందం, జవహర్ నగర్ పోలీసులతో కలిసి తిమ్మాయిపలకలి వైపు వెళ్తున్న సమయంలో నిందితులను పట్టుకున్నారని తెలిపారు. నిందితుల నుంచి 40 కిలోల గసగసాల గడ్డి, 10 గ్రాముల ఎండిఎంఎ, మొబైల్ ఫోన్ లు సీజ్ చేశామన్నారు.  పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. నిందితులపై పీడీ యాక్ట్ పెడతామన్నారు.

TAGS