Seize the Ship : ఆంధ్రా నుంచి ఆఫ్రికాకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఓడను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్టుకున్నారు. ఓడలోని అధికారుల నుంచి సరైన సమాధానం చెప్పకపోవడంతో షిప్ తో సహా అక్రమ రేషన్ బియ్యాన్ని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సీజ్ ది షిప్ అంటూ ఆయన చెప్పిన ఒక్క మాట నేషనల్ వైడ్ గా వైరల్ గా మారిన సంగతి తెల్సిందే..
కాగా అక్రమ రేషన్ బియ్యంతో కూడిన షిప్ ను కాకినాడ కలెక్టర్ నవంబర్ 27నే సీజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పెద్దగా ప్రచారంలోకి రాలేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంట్రీతో కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమ వ్యవహారాలు బట్టబయలయ్యాయి.
అయితే పవన్ కల్యాణ్ కు వస్తున్న పబ్లిషిప్ పై కొన్ని మీడియా గ్రూప్స్ ‘బాహుబలి’ మీమ్స్ తో వైరల్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ను బల్లలా దేవ్(రానా)తో.. కాకినాడ కలెక్టర్ ను అమరేంద్ర బహుబలి(ప్రభాస్) తో పోలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మీమ్స్ ను వైసీపీ సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తోంది.