JAISW News Telugu

Parliament Security : సీఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంట్ భద్రత

Parliament Security

Parliament Security

Parliament Security : పార్లమెంట్ భవన సముదాయం భద్రత బాధ్యతలను ఇక నుంచి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) నిర్వహించనుంది. 3,317 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది సోమవారం నుంచి పార్లమెంటు ఆవరణలో ఉగ్రవాద వ్యతిరేక, విధ్వంస నిరోధక భద్రత విధులు నిర్వహిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకూ సీఆర్ పీఎఫ్ కు చెందిన 1,400 మందికి పైగా సిబ్బంది పార్లమెంటు భద్రతను పర్యవేక్షించారు.

సీఆర్ పీఎఫ్ కు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ (పీడీజీ) గత శుక్రవారం తన కమాండోలను ఉపసంహరించుకుందని, డీఐజీ ర్యాంకు స్థాయి అధికారి పార్లమెంట్ కాంప్లెక్స్ లోని అన్నా సెక్యూరిటీ పాయింట్‌లను సీఐఎస్ ఎఫ్ కు అప్పగించారని అధికారులు తెలిపారు. గత ఏడాది డిసెంబరు 13న పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘన ఘటన తర్వాత పాత, కొత్త పార్లమెంట్ భవనాలు, అనుబంధ నిర్మాణాల భద్రతా బాధ్యతలను సీఐఎస్ఎఫ్ కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Exit mobile version