JAISW News Telugu

Secunderabad-Goa : సికింద్రాబాద్-గోవా బైవీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు

Secunderabad-Goa

Secunderabad-Goa

Secunderabad-Goa : తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించనుంది. ఇప్పటి వరకు వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్ చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. ఇది కాకుండా కాచిగూడ-యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్ లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్-గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు. ఇప్పుడు సికింద్రాబాద్-వాస్కోడిగామా మధ్య బైవీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించడంతో ప్రధాని మోదీ, రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ లకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గోవా వెళ్లే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నూతన సర్వీసు అందుబాటులోకి రావడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్-గోవా బైవీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్ డెమ్, మడావ్ జంక్ష్లన్లలో ఆగుతూ వాస్కోడిగామా చేరుకుంటుందని రైల్వేశాఖ వెల్లడించింది.

Exit mobile version