Congress Won : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ విజయం

Congress Won
Congress Won : సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి శ్రీగణేశ్ గెలుపొందారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి శ్రీగణేశ్, బీజేపీ నుంచి వంశతిలక్, బీఆర్ఎస్ నుంచి నివేదిత సాయన్న పోటీ చేశారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై శ్రీగణేశ్ 9,725 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శ్రీగణేశ్ 2018, 2023లలో బీజేపీ నుంచి పోటీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు.
2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత గెలుపొందారు. ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దీంతో కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కి ఉప ఎన్నిక అనివార్యమైంది.
TAGS CongressCongress wonLoksabha Elections 2024SecunderabadSecunderabad cantonmentSri Ganeshtelangana