Donald Trump : ‘‘ట్రంప్ తో ఆ హోటల్ లో ఏకాంతంగా..’’ శృంగార తార స్టార్మీ డానియల్
Donald Trump : భారత్ లో లాగానే అమెరికాలోనూ ఎన్నికల సందడి నెలకొంది. నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు ట్రంప్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా వీరిద్దరే ప్రత్యర్థులు అని మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో ‘ఏకాంతంగా’ గడిపానని శృంగార తార స్టార్డీ డేనియల్ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. అధ్యక్ష ఎన్నికల టైంలో తనపై వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్ అడ్డదారులు తొక్కారనే ఆరోపణలపై విచారణ జరుగుతున్న క్రమంలో న్యూయార్క్ కోర్టులో ఆమె వాంగ్మూళం ఇచ్చారు.
2006లో ఓ గోల్ఫో టోర్నమెంట్ లో ట్రంప్ ను తొలిసారి కలిశానని, ఆ తర్వాత ఓ బాడీగర్డ్ ద్వారా తనను డిన్నర్ కు పిలిచాడని తెలిపింది. అనంతరం హోటల్ సూట్ కు తీసుకెళ్లారని..ఆయన ఉద్దేశం ఏంటో అర్థమైందన్నారు. అక్కడ ఇద్దరం ఏకాంతంగా గడిపామని, ఆ తర్వాత ఇద్దరు పలుమార్లు కలుసుకున్నా సన్నిహితంగా మెలగలేదన్నారు. తమ సంబంధం గురించి ఎంతో మందికి తెలుసన్నారు.
2011లో ఓ బ్లాగ్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చిందని, 2016 ఎన్నికల టైంలో 1,30,000 డాలర్ల మొత్తాన్ని ట్రంప్ న్యాయవాది మైఖేల్ కోహెన్ నుంచి స్వీకరించానని డానియల్ పేర్కొంది. అయితే ట్రంప్ నుంచి డబ్బులు వసూలు చేయడం తన ఉద్దేశం కాదన్నారు. ఆమె చేసిన ఆరోపణలను ట్రంప్ న్యాయవాదులు తోసిపుచ్చారు. కేవలం డబ్బుల కోసమే మాజీ అధ్యక్షుడిపై ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించారు.
వాదనల సమయంలో తన న్యాయవాదులతో ట్రంప్ గుసగుసలాడారు. ఆమె సాక్ష్యం చెబుతున్న సమయంలో ట్రంప్ తన తలను ఊపుతున్నట్లు కనిపించారు. అది సాక్షులను బెదిరించడమే అవుతుందని ట్రంప్ న్యాయవాదులకు జ్యూరీ సభ్యులు సూచించడం గమనార్హం.