Scotland : నమీబీయాపై స్కాట్లాండ్ సూపర్ విక్టరీ 

Scotland

Scotland

Scotland : నమీబీయా, స్కాట్లాండ్ మధ్య జరిగిన 12వ గ్రూపు మ్యాచ్ లో స్కాట్లాండ్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 155 పరుగుల వద్ద ఇన్సింగ్స్ ముగించింది. నమీబియా కెప్టెన్ ఎరస్మర్ 52 పరుగులతో రాణించాడు. అయిదు ఫోర్లు, రెండు సిక్సులతో చెలరేగి కేవలం 31 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. జానే గ్రీన్ 28 పరుగులతో అదరగొట్టాడు.

స్కాట్లాండ్ బౌలర్ వీల్ 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మరో ఫేస్ బౌలర్ రెండు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు ఒక్కొ వికెట్ తీశారు. నమీబియా బ్యాటర్లను ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేర్చిన స్కాట్లాండ్ బౌలర్లు 37 పరుగులకే 3 వికెట్లు తీశారు. నమీబియా కెప్టెన్ ఏరస్మస్ మినహా మిగతా బ్యాట్స్ మెన్స్ వేగంగా ఆడకపోవడంతో 155 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఇన్సింగ్స్ ముగించింది.

అనంతరం బ్యాటింగ్ దిగిన స్కాట్లాండ్ బ్యాటర్లు స్పీడ్ గా ఆడి 18.3 ఓవర్లలోనే  156 పరుగులు ఛేజ్ చేేసి శభాష్ అనిపించుకున్నారు. ఓపెనర్ మున్సీ 7 పరుగులకే ఔట్ అయిన ఓపెనర్ జోన్స్ (17), వన్ డౌన్ బ్యాట్స్ మెన్ మెక్ ముల్లన్ (26) పరుగులు చేసి పార్ట్ నర్ షిప్ బిల్డ్ చేశారు. వీరిద్దరూ ఔటైన తర్వాత కెప్టెన్ రిచి బెరింగ్ టన్ (47) 2 ఫోర్లు, 2 సిక్సులతో నమీబియా బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. చివర్లో మైకెల్ లీస్ 17 బంతుల్లోనే 35 పరుగులు చేయగా.. నాలుగు సిక్సులు బాదాడు. దీంతో మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే 156 టార్గెట్ ను ఛేజ్ చేసింది.

నమీబియా ప్రధాన బౌలర్లు వికెట్లు తీయకపోవడంతో మ్యాచ్ లో వెనకబడ్డారు. చివరకు కెప్టెన్ ఎరాస్మస్ నాలుగు ఓవర్లు వేసి 29 పరుగులకే 2 వికెట్లు తీశాడు. గ్రూపులో నమీబియా ఓమన్ పై మ్యాచ్ గెలవగా.. స్కాట్లాండ్ నమీబియాపై గెలిచింది. ఇంగ్లండ్, స్కాట్లాండ్ మ్యాచ్ రద్దు కాగా.. చెరో పాయింట్ పంచుకున్నాయి. ఆస్ట్రేలియా ఓమన్ పై గెలిచి రెండు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. దీంతో గ్రూపు బిలో పోటీ రసవత్తరంగా మారింది.

TAGS