
School holidays
School Holidays : తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలకు రేపటి నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభమై జూన్ 11వ తేదీ వరకు కొనసాగుతాయి. 2024-25 సంవత్పరానికి గాను జూన్ 12వ తేదీన పాఠశాలలు పున:ప్రారంభమవుతాయి. ఈరోజు 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రొగ్రెస్ కార్డులు ఉపాధ్యాయులు అందజేశారు.
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతన్నాయి. ఒంటిపూట బడులు మార్చి 15 నుంచి మొదలు కాగా మంగళవారంతో ముగియనున్నాయి. ఏడాది పాటు పుస్తకాలు, పరీక్షలతో కుస్తీ పట్టిన విద్యర్థులు వేసవి సెలవుల్లో ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బుధవారం ఇంటర్ ఫలితాలు వెలువడనుండగా, 30వ తేదీన టెన్త్ ఫలితాలు వెలువడనున్నాయి.