Pushpa : పుష్ప సినిమాతో స్కూలు పిల్లలు చెడిపోతున్నారు..హెడ్ మాస్టర్ ఫైర్

Pushpa

Pushpa

Pushpa : ‘పుష్ప 2’ సినిమా విడుదలై రెండు నెలలు పూర్తి అయినప్పటికీ దీనిపై వివాదాలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. తాజాగా, ఈ సినిమాపై ఓ స్కూల్ హెడ్మాస్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు నిర్ణయాలపై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ యూసఫ్ గూడాలోని ఓ ప్రైవేట్ స్కూల్ హెడ్మాస్టర్ మాట్లాడుతూ “మా స్కూల్లో పిల్లలు సగం మంది పుష్పలా మారిపోయారు. వారి మాట తీరుతో పాటు, నడవడిక కూడా సినిమా ప్రభావంలో ఉంది. ఎంత చెప్పినా మా మాట వినట్లేదు. అదే ట్రెండు, అదే ఫ్యాషన్ అని ఎదురు సమాధానాలు ఇస్తున్నారు. ఈ సినిమాను చూసి పిల్లలు బాగా చెడిపోయారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలా సర్టిఫికెట్ ఇస్తుందో అర్థం కావడం లేదని, సమాజంపై వీటి ప్రభావాన్ని పరిశీలించాకే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని ఆమె సూచించారు. “సినిమాలు తీయడం గొప్ప విషయం కాదు, కానీ ఆ సినిమాల ప్రభావం ఎంతవరకు ఉంటుందో ఆలోచించాలి. సెన్సార్ బోర్డు మరింత జాగ్రత్తగా ఉండాలి” అంటూ ఆమె మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ఈ అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి, దీనిపై సెన్సార్ బోర్డు సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Fukkard (@fukkard)

TAGS