
CM Chandrababu
CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం హోదాలో తొలిసారి హస్తినకు వెళ్లిన చంద్రబాబు ఈ పర్యటనలో పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఢిల్లీలో చంద్రబాబు షెడ్యూల్ ఇలా ఉంది.
ఈరోజు ఉదయం 10.15 గంటలకు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం 9 గంటలకు వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‍తో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యాహ్నం 2.45 గంటలకు హోం మంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు.
రేపు ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం, ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఉదయం 10.45 గంటలకి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర మంత్రి అథవాలేతో భేటీ కానున్నారు. తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ రాయబారితో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.