Scam 2010 : స్కామ్ 2010 ‘ది సుబ్రతా రాయ్ సాగా’ను ప్రకటించిన మేకర్స్..

Scam 2010

Scam 2010

Scam 2010 : బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ హన్సల్ మెహతా తన స్మాష్ హిట్ సిరీస్ ‘స్కామ్’ మూడో సీజన్ ‘స్కామ్ 2010 – ది సుబ్రతా రాయ్ సాగా’ను గురువారం అనౌన్స్ చేశారు. ఇది వ్యాపారవేత్త సుబ్రతా రాయ్ జీవిత కథ ఆధారంగా చిత్రీకరించినట్లు తెలిపారు. తమల్ బందోపాధ్యాయ రాసిన ‘సహారా: ది అన్‌టోల్డ్ స్టోరీ’ పుస్తకం ఆధారంగా, సోనీ LIV ఈ సిరీస్‌ని అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, స్టూడియో నెక్ట్స్, హన్సల్ ఫిల్మ్ తో కలిసి నిర్మిస్తున్నాయి.

స్కామ్ మొదటి సీజన్ ‘స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ’, రెండోది ‘స్కామ్ 2003: ది తెల్గి స్టోరీ’ భారీ సక్సెస్ సాధించాయి. ఇప్పుడు వచ్చే మూడో సీజన్ ‘స్కామ్ 2010 – ది సుబ్రతా రాయ్ సాగా’ మరింత ఎంగేజింగ్ గా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు.

స్కామ్ 2010 రాయ్ డస్ట్-టు-డైమండ్స్ కథ. 2000వ దశకం ప్రారంభంలో, రాయ్ చిట్-ఫండ్ అవకతవకల నుంచి నకిలీ పెట్టుబడిదారుల వరకు ఆరోపణల సుడిగుండంలో చిక్కుకున్నారు. చివరికి 2014లో అతని అరెస్ట్ కు దారితీసింది. దాదాపు ₹25,000 కోట్లు ఇప్పటికీ ప్రభుత్వ అధికారుల వద్ద క్లెయిమ్ చేయకుండా ఉన్నాయి.

‘స్కామ్ అనేది నాకు కేవలం ఫ్రాంచైజీ మాత్రమే కాదు. ఇది చరిత్ర. ఈ పెద్ద జీవితం కంటే పెద్ద కథను సజీవంగా తీసుకురావడానికి అప్లాజ్, సోనీ LIVతో కలిసి మళ్లీ పని చేయడం లా ఆనందంగా ఉంది.’ అని హన్సల్ మెహతా ఒక ప్రకటనలో తెలిపారు.

అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సమీర్‌ నాయర్‌ మాట్లాడుతూ స్కామ్‌ సిరీస్‌ పాప్‌ కల్చరల్‌ ఫినామినేషన్‌గా మారిందని అన్నారు. ‘స్కామ్ 2010: ది సుబ్రతా రాయ్ సాగా’తో భారతీయ వ్యాపార చరిత్రలో అత్యంత సాహసోపేతమైన, ప్రతిష్టాత్మకమైన వ్యక్తుల్లో ఒకరి జీవితం, వారి నివసించే సమయంలోకి ప్రేక్షకులకు తీసుకెళ్లే ప్రయాణాన్ని అందిస్తూ, స్థాయిని మరింత పెంచేందుకు సిద్ధంగా ఉన్నా’ అని నాయర్ చెప్పారు.

డానిష్ ఖాన్, SonyLIV, తదుపరి స్కామ్ సిరీస్ కోసం మెహతా, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ‘ఈ సిరీస్ సోనీ LIVలో అత్యధికంగా వీక్షించబడిన ఫ్రాంచైజీగా నమోదైందని, మూడో సీజన్ కూడా ఆకట్టుకునే కథనాల్లో కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టిస్తుందని మేము విశ్వసిస్తున్నాము,’ అని చెప్పాడు.

TAGS