YS Jagan : జగన్ భాషపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు
YS Jagan : ఆంధ్రప్రదేశ్ ను జగన్ పాలన అస్తవ్యస్తంగా మార్చింది. ఎటు చూసినా దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలే దర్శనమిస్తున్నాయి. దీంతో పాలన గతి తప్పుతోంది. ఈనేపథ్యంలో ఏపీలో జగన్ తీరుతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. చెప్పేవి అన్ని అబద్ధాలే. చేసేవి అన్ని దొంగతనాలే. దీని వల్ల ప్రజల ఇబ్బందులు ఇంకా పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు.
కంపెనీలు ఏపీకి బదులు తెలంగాణకు తరలిపోయాయి. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఉపాధి అవకాశాలు అడుగంటుతున్నాయి. ఇక అప్పుల విషయానికి వస్తే రాష్ట్రం అప్పుల్లోనే కూరుకుపోతోంది. ఎడాపెడా అప్పులు తీసుకొస్తూ రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేస్తున్నారు. దీని వల్ల అప్పుల కుంపటి రాజుకుంటోంది. దీంతో రాష్ట్రం డెవలప్ మెంట్ కుంటుపడుతోంది.
ఇక పాఠశాలల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఎటు చూసినా శిథిలావస్థకు చేరిన బడులే కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులకు చదువు అందడం లేదు. సర్కారు పాఠశాలలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. డెవలప్ మెంట్ విషయంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. దీంతోనే రాష్ట్రం సమస్యలకు నిలయంగా మారింది.
ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఈ దందాలో లక్షలాది కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో ఇసుకాసురులు తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దీని వల్ల ఇసుక దందాను అడ్డుకునే వారే కనిపించడం లేదు. జగన్ పాలనలో ఇసుక మాఫియా మరింత విస్తరిస్తోంది. సహజ వనరులను నాశనం చేస్తున్నారు.
ఈనేపథ్యంలో జగన్ పాలన వల్ల ప్రజలు పరేషాన్ అవుతున్నారు. అన్ని రంగాలు వెనుకబడిపోతున్నారు. అందుకే ప్రజలు అధికార మార్పిడికి మొగ్గు చూపుతున్నారు. జగన్ ను ఇంటికి సాగనంపేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇలా జగన్ బాధల నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నారు. దీని కోసం టీడీపీకి ఓటు వేయాలని భావిస్తున్నారని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో జగన్ పాలనపై సెటైర్లు వేస్తున్నారు. అన్ని రంగాల్లో జగన్ అసమర్థతపై తమదైన శైలిలో పాటల రూపంలో బయటపెడుతున్నారు. ప్రతి రంగంలో జగన్ తీరును ఎండగడుతున్నారు. జగన్ తీరుతో ఎలా మోసపోతున్నారో వివరిస్తున్నారు. ఆయన మాట్లాడే మాటలను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. సభల్లో పేలని ఆయన పంచ్ లు, ప్రాసలపై కూడా కామెంట్లు చేస్తున్నారు. ఆయన మాటాలను వినే ఓపిక జనాలకు లేదని..జగన్ ఇంటికి వెళ్లడమే తరువాయి అంటున్నారు.