White House : వైట్ హౌస్ లో ‘సారే జహాసే అచ్చా..’ ‘పానీపూరీ’
White House : ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయియన్, పసిఫిక్ ఐలాండర్ (AA and NHPI) లపై అధ్యక్షుడి సలహా ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అగ్ర రాజ్యానికి AA and NHPI కమ్యూనిటీలు చేస్తున్న సహకారానికి గుర్తుగా వైట్ హౌస్ లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భారత్ కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతాన్ని ఆలపించడంతో పాటు వచ్చిన అతిథులకు భారత్ స్ట్రీట్ ఫుడ్ పానీపూరీ అందించడం విశేషం.
భారత సంతతికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న యూఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ వివేక్ మూర్తి ఉత్సాహంగా డ్రమ్స్ వాయించడంతో అక్కడున్నవారంతా ఆనందంలో మునిగిపోయారు. మానసిక రోగాలను నయం చేయడంలో సంగీతం ముఖ్యపాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Thrilled to hear Saare Jahan Se accha Hindustan Hamara played at WHite House AANHPI heritage celebration hosted by President @JoeBiden with VP Harris @VP . Paanipuri and Khoya dish was also served .stronger US India relationship . @PMOIndia @narendramodi @DrSJaishankar @AmitShah pic.twitter.com/1M5lViwbF2
— Ajay Jain (@ajainb) May 14, 2024