Kriti Sanon:పరిశ్రమలో అక్కా చెల్లెళ్ల అనుబంధం గురించి చెప్పాలంటే పలువురి పేర్లను పరిశీలించాలి. కరీనా కపూర్ ఖాన్ – కరిష్మా కపూర్..శిల్పా శెట్టి -షమితా శెట్టి.. అమృతా అరోరా – మలైకా అరోరా, అలియా భట్- షహీన్ భట్.. కంగన-రంగోలి సిస్టర్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. నేటితరంలో జాన్వీ కపూర్ – ఖుషీ కపూర్ .. ఇతర కపూర్ సిస్టర్స్ మధ్య అనుబంధం గురించి నిరంతరం కథనాలొస్తున్నాయి. టాలీవుడ్ లో శివానీ రాజశేఖర్- శివాత్మిక రాజశేఖర్ వంటి సిస్టర్స్ ఉన్నారు.
కానీ వీళ్లందరి కంటే సనన్ సిస్టర్స్ చాలా భిన్నం. ఒకరికొకరు సన్నిహితంగా మెలగడమే కాదు.. తన సోదరి నూపుర్ సనోన్ కెరీర్ ఎదుగుదల కోసం కృతి చాలా త్యాగాలు చేసింది. కృతి సనన్ టాలీవుడ్ లో 1- నేనొక్కడినే చిత్రంతో కథానాయికగా పరిచయమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ తో కలిసి `హీరో పంథి` అనే చిత్రంలో నటించింది. కెరీర్ ఆరంగేట్రమే నటిగా తనదైన ముద్ర వేసిన ఈ బ్యూటీ కెరీర్ పరంగా వెనుదిరిగి చూసిందే లేదు. నేటితరంలో ప్రామిస్సింగ్ స్టార్ గా కృతి ఎదిగేసింది.
అదే సమయంలో తన సోదరి నుపుర్ కెరీర్ ని కృతి చక్కదిద్దింది. కృతికి ఉన్న సత్సంబంధాల నుంచి నూపుర్ కి చక్కని అవకాశాలు వస్తున్నాయి. ఇక కృతి కెరీర్ ని చక్కదిద్దేందుకు తన విలువైన సమయాన్ని సిస్టర్ కోసం వెచ్చించింది కృతి. ఇక తన సోదరి బర్త్ డే సందర్భంగా కృతి ఎమోషనల్ గా స్పందించింది. నా జీవితంలో నువ్వు తోడు అంటూ సోదరిపై ప్రేమను కురిపించింది. ఇక మీదటా మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించింది.
నుపుర్ సనన్ టాలీవుడ్ ప్రవేశం..
తెలుగు చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు`లో రవితేజ సరసన నుపుర్ సనన్ నటించింది. ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా నుపుర్ అందచందాలు, నటనకు పేరొచ్చింది. తదుపరి ఇక్కడ పెద్ద అవకాశాల కోసం వేచి చూస్తోంది. నూపర్ భారతీయ సినిమా గొప్పతనం గురించి, పాన్ ఇండియా అవకాశం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. “ప్రపంచ చలనచిత్రాలు అడ్డంకులను బద్దలు కొట్టాయి..భారతీయ కథలు ఆస్కార్, ఎమ్మీలలో గుర్తింపు పొందాయి. నా మూడవ చిత్రమే తెలుగు సినిమాల్లోకి ప్రవేశించడం విలువైన అనుభవం.. నేర్చుకునేందుకు ఎదిగేందుకు ఇది సదవకాశం` అంటూ నూపర్ ఉప్పొంగిపోయింది.
సాంస్కృతిక భేదాలు ఉన్నప్పటికీ, భావోద్వేగాలు మనల్ని కలుపుతాయి. దేశవ్యాప్తంగా విభిన్న వర్గాల ప్రేక్షకులను చేరుకోవడంలో ఇప్పుడు తారలు కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలను విశ్వవ్యాప్త భాషగా మార్చారు అంటూ నూపర్ సనన్ ఎంతో ఉద్వేగంగా మాట్లాడింది. పాన్-ఇండియా చలనచిత్రం చేయడం అనేది గేమ్-ఛేంజర్. ఒక రెగ్యులర్ హిందీ సినిమా హీరోయిన్ పాత్రకు ఇది దూరంగా ఉంటుంది. ఇది నా పనికి వైవిధ్యాన్ని తెస్తుంది. నటీనటులు మూస పద్ధతులకు అతీతంగా మారుతున్న విధానాన్ని ప్రతిబింబిస్తుంది. పాన్-ఇండియా విధానం నా పరిధిని విస్తరిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే మార్గమిది. అని కూడా నుపుర్ అంది.