Sankranti : సంక్రాంతి.. ప్రతీ ఇంటా సిరుల పంట
Sankranti : ప్రపంచానికి కనిపించే దేవుడు సూర్యుడు. సమస్త జీవరాశి మనుగడకు సూర్యుడే మూలం. ఆయన వల్లే మనకు పగలు, రాత్రి ఉంటున్నాయి. దీంతో మన గమనం సాగుతోంది. ఈ కాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు రకాలుగా పిలుస్తారు. సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతల కోసం దక్షిణాయణం పెద్దల కోసం పాటిస్తుంటాం. ఇలా రెండు కాలాల సమయంలో మనకు వచ్చే పండుగలకు ప్రత్యేకతలు ఉండటం సహజమే.
ఉత్తరాయణంలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి. పంటలు పండి ధాన్యం నిల్వలు ఇళ్లల్లో ఉంటాయి. దీంతో ఈ కాలంలో వచ్చే సంక్రాంతికి నెల రోజుల నుంచే వేడుకలు ప్రారంభమవుతాయి. ఇళ్లల్లో ముగ్గుల సందళ్లు. హరిదాసుల పలకరింపులు, పతంగులు ఎగరేసే చిన్నారులు ఇలా మనకు రకరకాల కార్యక్రమాలతో హంగామా చేస్తుంటారు. ఏపీలో కోడి పందాలు ఆడుతుంటారు.
మనది వ్యవసాయక ప్రదేశం కావడంతో పిండి వంటలు ఘనంగా చేస్తుంటారు. ఉత్తరాయణంలో చలి తగ్గుముఖం పడుతుంది. దీంతో హాయిగా ఉంటుంది. సంక్రాంతిని మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుము పండుగ నిర్వహిస్తారు. అత్యంత వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. పూర్వ కాలం నుంచి కూడా సంక్రాంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
సంక్రాంతి వేళ ప్రతి ఇంట సిరుల పంట అన్నట్లుగా ఉంటుంది. దేశంలో ఎక్కడ ఉన్నా ఏపీ వారు మాత్రం తమ ఇళ్లకు చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పిండి వంటలు ఆనందంగా తింటారు. సంక్రాంతి వేడుకలను మనసారా ఆస్వాదిస్తారు. పండుగ వేళ సంతోషంగా బంధువులతో ఉండేందుకు ఇష్టపడతారు. ఇలా సంక్రాంతి పండగ మన ఇంట సిరులు పండించే పండగగా అభివర్ణిస్తుంటారు.
– తోటకూర రఘు,
ఆంధ్రజ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు.