Sankranti Celebrations : తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు వైభవోపేంగా నిర్వహిస్తున్నారు. 1971 నుంచి ఈ సంఘం అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తుంది. భారత సంస్కృతిక పండుగలు, కార్యక్రమాలను సంస్థ నిర్వహిస్తూ భారతీయ సంప్రదాయాలను దశ దిశలా చాటుతుంది. తెలుగు సారస్వత సంస్కృతిక సంఘంకు ఇండియన్ అమెరికన్ల నుంచి మంచి స్పందన వస్తుంది.
ప్రతీ ఏటా నిర్వహించిన విధంగానే ఈ యేడు కూడా సంక్రాంతి సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి పర్వదినం ముగిసిన తర్వాత జనవరి 27వ తేదీ శనివారం రోజున న్యూ యార్క్ లోని ద హిందూ టెంపుల్ సొసైటీ నార్త్ అమెరికాలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయని సంఘం ప్రెసిడెంట్ కిరణ్ రెడ్డి పర్వతాల తెలిపారు.
ఈ ఈవెంట్ లో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, తెలుగు పాటలు ఉంటాయన్నారు. ఈ వేడుకల్లో వివిధ విభాగాల్లో పోటీలు కూడా నిర్వహించనున్నారు. వీటిలో గెలిచిన వారికి బహుమతులు కూడా అందజేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. ఈవెంట్ లో పాల్గొనేందుకు సభ్యులకు 15 డాలర్లు, బయటి వ్యక్తులకు 20 డాలర్ల టికెట్ ఉంటుందని పేర్కొన్నారు. సంక్రాంతి సంబురం ఈవెంట్ లో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
టాప్ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, మేల్ సింగర్ పృథ్వీ చంద్రా, ఫీమేల్ సింగర్ సమీరా భరద్వాజ్, ఆర్‌జే హేమంత్ ప్రముఖ సంప్రదాయ డ్యాన్సర్ మహేశ్వరి ఈ ఈవెంట్ లో వారి వారి ప్రదర్శనలు ఇస్తున్నారు.