Sankranti 2024 celebrations in Albany : NYCR (న్యూయార్క్ కనెక్టింగ్ రైల్ రోడ్) పరిధిలో నివసిస్తున్న తెలుగు మూలాలున్న ప్రజల కోసం ఏర్పాటు చేసిన సంస్థ ‘అల్బానీ తెలుగు అసోసియేషన్ (ATA)’. ఈ సంస్థ ఎలాంటి లాభపేక్ష లేకుండా తెలుగు వారి కోసం నిర్వహించబడుతుంది. తెలుగు సంస్కృతిక వారసత్వాన్ని రక్షించడం, ప్రచారం చేయడం, సభ్యుల మధ్య తెలుగు సంస్కృతిక, విద్యా, సామాజిక, స్వచ్ఛంద పరస్పర చర్యలకు వేదికను అందించడానికి ఏర్పడింది.
ఈ సంస్థ ఏర్పడినప్పటి నుంచి అల్బనీలోని తెలుగు వారి అవసరాలు, సమస్యలు తీరుస్తూ తెలుగు వారిని ఒక్కటి చేస్తుంది. దీంతో పాటు అనేక సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. భారత్ లో తెలుగు వారు జరుపుకునే ప్రతీ పండగను వైభవంగా తెలుగువారితో నిర్వహిస్తూ వస్తుంది. సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి పర్వదినాలను పురస్కరించుకొని భారీగా ఈవెంట్లు నిర్వహిస్తుంది.
ఇందులో భాగంగా ఈ ఏడాది (2024) సంక్రాంతి సందర్భంగా సంబురాలను నిర్వహిస్తుంది. సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత జనవరి 27వ తేదీ భారీ ఈవెంట్ ఏర్పాటు చేస్తుంది. అల్బెని శేఖర్ రోడ్, అల్బెనిలోని హిందూ కల్చరల్ సెంటర్ లో సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈవెంట్ కొనసాగుతుంది. ఈ ఈవెంట్ కు టీవీ ఆర్టిస్ట్ ఇంద్రనీల్, హర్షిత యార్లగడ్డ పాల్గొంటున్నారు. ఈ సంబురాలకు తెలుగు వారు పెద్ద సంఖ్యలో హాజరై సక్సెస్ చేయాలని ATA అధ్యక్షుడు వెంకట్ జాస్తి పిలుపునిచ్చారు.
ఈ ఈవెంట్ లో సంక్రాంతి సంప్రదాయం ప్రకారం నిర్వహించుకోవడంతో పాటు.. సంస్కృతిక కార్యక్రమాలు, సింగింగ్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయిన వెంకట్ తెలిపారు.