JAISW News Telugu

Ram Charan : తమ్ముళ్ళతో రామ్ చరణ్..సంక్రాంతి సంబరాల్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిల్చిన అకిరా నందన్!

FacebookXLinkedinWhatsapp
Ram Charan

Ram Charan And Mega Family

Ram Charan  Sankranti Celebrations  : ఈ బిజీ లైఫ్ లో కుటుంబం మొత్తం కలిసి సంక్రాంతి పండగ జరుపుకోవడం ఇప్పుడు చాలా కష్టం అయ్యింది. ఒక్కొక్కక్కరు ఒక్కో చోట ఉండడం, పనులు ఉండడం వల్ల అందరూ కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకోవడం చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలోనే మెగా ఫ్యామిలీ ని చూస్తే కుళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ పండగ వచ్చినా కూడా వీళ్లంతా ఒకే చోట కలుస్తారు, ఒక చోట సంబరాలు చేసుకుంటారు.

ఫ్యామిలీ లో  ఒక్కొక్కరు పెద్ద పాన్ ఇండియా సూపర్ స్టార్స్. ప్రతీ రోజు షూటింగ్స్ తో క్షణకాలం తీరిక లేకుండా గడుపుతూ ఉండే వీళ్ళు, పనులు మొత్తం పక్కన పెట్టేసి, ఇలా అందరూ కలిసి ఒక చోటుకు చేరి సంబరాలు చేసుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. రీసెంట్ సంక్రాంతి పండుగ సందర్భంగా వీళ్లంతా కలిసి బెంగళూరు లోని ఫామ్ హౌస్ కి వెళ్లారు. అక్కడ మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోలలో మెగా మరియు అల్లు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం మిస్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో ఎంత బిజీ గా గడుపుతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. అందుకే ఈ సంబరాల్లో ఆయన పాలు పంచుకోలేదు. ఆయన రాకపోయినా కూడా ఆయన కొడుకు అకిరా నందన్, మరియు కూతురు ఆద్య విచ్చేసారు. ఈ వేడుకల్లో అకిరా నందన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారాడు. అదిరిపోయే లుక్స్ తో చిన్న పవన్ కళ్యాణ్ ని తలపించడమే కాకుండా, తన మ్యూజిక్ టాలెంట్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘ఎనిమల్’ చిత్రం లోని ఫాదర్ థీమ్ మ్యూజిక్ ని పియానోతో వాయిస్తూ అకిరా ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండింగ్ టాపిక్ అయ్యాడు. ఇంత అద్భుతంగా మ్యూజిక్ వాయిస్తున్నాడు, ఈ రేంజ్ టాలెంట్ ఉందని అనుకోలేదు అంటూ ఫ్యాన్స్ సిసిల మీడియా అకిరాని చూసి మురిసిపోతున్నారు.

అంతే కాకుండా రీసెంట్ గా నాగబాబు షేర్ చేసిన కొన్ని ఫోటోలలో రామ్ చరణ్ తన తమ్ములందరితో కలిసి కూర్చున్న ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఈ ఫోటో ని చూసిన మెగా ఫ్యాన్స్ ఒకప్పుడు చిరంజీవి బిజీ గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ , శ్రీజా, సుస్మితని చూసుకునేవాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బిజీ అవ్వడం తో అకిరా, ఆద్య లను రామ్ చరణ్ చూసుకుంటున్నాడు. ఇదే మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న అనుబంధం అని అంటున్నారు ఫ్యాన్స్.

Exit mobile version