Sanjeev Sharma : భారతీయ రైల్వే నుండి స్పేస్‌ఎక్స్‌కు ఎదిగిన ఇంజనీర్ సంజీవ్ శర్మ

Sanjeev Sharma

Sanjeev Sharma

Sanjeev Sharma : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పూర్వ విద్యార్థికి సంబంధించిన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ రైల్వేలో పనిచేసిన ఇంజినీర్ ప్రస్తుతం ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో ముఖ్యమైన స్థానానికి ఎదిగిన ప్రయాణం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి డిగ్రీ పొందిన మెకానికల్ ఇంజనీర్ అయిన సంజీవ్ శర్మను లింక్డ్ ఇన్లో చాలా మంది ఆదర్శంగా తీసుకుంటున్నారు.  భారత ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించడం నుండి ఇప్పుడు ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో పని చేయడం వరకు అతడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.  ప్రజలు అతని లింక్డ్‌ఇన్ పేజీ స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌లపై “స్పూర్తిదాయకం”, “అద్భుతం”,”ఇన్క్రెడిబుల్” వంటి  కామెంట్స్ చేస్తున్నారు.

సంజీవ్ శర్మ ఎవరు?
శర్మ భారతీయ రైల్వేలో డివిజనల్ మెకానికల్ ఇంజనీర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. అతను IIT రూర్కీ నుండి గ్రాడ్యుయేషన్ తర్వాత నాలుగు సంవత్సరాల పాటు ఆ పదవిలో ఉన్నాడు. 1994లో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా పదోన్నతి పొందారు. 11 ఏళ్లకు పైగా పనిచేసిన తర్వాత ఉద్యోగం మానేశాడు. సంజయ్ శర్మ 2002లో యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఒక-సంవత్సరం ఎంఎస్ ప్రోగ్రామ్‌లో చేరారు. తన డిగ్రీని సంపాదించిన తర్వాత, అతను 2003లో సీగేట్ టెక్నాలజీస్‌లో స్టాఫ్ మెకానికల్ ఇంజనీర్ అయ్యాడు. 2008లో అతను సీనియర్ మెకానికల్ ఇంజనీర్‌గా పదోన్నతి పొందాడు.  2013లో నిష్క్రమించే ముందు ఐదు సంవత్సరాలు అమెరికన్ డేటా స్టోరేజ్ కంపెనీలో పనిచేశాడు.

సీగేట్‌లో పనిచేస్తున్నప్పుడే 2008లో యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా నుండి టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌లో ఎంస్ డిగ్రీని కూడా పొందాడు. ఆ తర్వాత అమెరికన్ స్పేస్ కంపెనీ SpaceXలో డైనమిక్స్ ఇంజనీర్‌గా పనిచేశాడు. అక్కడ అతను స్ట్రక్చరల్ డైనమిక్స్ ఇనిషియేటివ్‌లను పర్యవేక్షించాడు. థర్మల్, ప్రొపల్షన్, ఏరోడైనమిక్స్, GNC (గైడెన్స్, నావిగేషన్ మరియు కంట్రోల్) బృందాలతో పనిచేశారు.

TAGS