Sanjay Raut : ఎన్నికల ఫలితాలపై సమ్‌థింగ్ ఫిషీ అన్న సంజయ్ రౌత్..
Sanjay Raut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘మహాయతి’ 200 సీట్లతో ముందంజలో ఉంది. అయితే, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన ఫలితాన్ని అంగీకరించడానికి నిరాకరించింది. పైగా ఇది మోడీ, అమిత్ షా కుట్రగా అభివర్ణించింది. ఉదయం 11 గంటల వరకే మహాయతి 223 స్థానాల్లో, మహా వికాస్ అఘాడి (MVA) 55 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ‘కుచ్ తో గద్బద్ హై (సమ్ థింగ్ ఫిసీ)’ అంటూ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. ఏ ప్రాతిపదికన ఏక్ నాథ్ షిండే (శివసేన)కు 56 సీట్లు వస్తాయని ప్రశ్నించారు.
పార్టీకి 120 సీట్లు రావడానికి దేవేంద్ర ఫడ్నవీస్, మోదీ, షా ఏం చేశారని రౌత్ ప్రశ్నించారు. తాము మైదానంలో ఉన్నామని, ప్రజాస్వామ్యం తీర్పును అంగీకరిస్తున్నామని శివసేన (యూబీటీ) నాయకుడు అన్నారు. అయితే ఈ రిజల్ట్‌ని ఎలా అంగీకరిస్తారనేది రాష్ట్ర ప్రజలకు ప్రశ్నగా మారనుందని చెప్పుకచ్చారు. ‘శరద్ పవార్ (ఎన్సీపీ)కి 10 సీట్లు కూడా రాకపోవడం ఎలా సాధ్యమైంది?’ గెలుపు ఓటములు సహజమే కానీ ఇది ప్రజా తీర్పు కాదు. దీని వెనుక ఏదో కుట్ర ఉంది.’ అని రౌత్ మీడియా ప్రతినిధులతో అన్నారు.
‘లడ్కీ బహిన్’ పథకం వల్ల మహాయతి లబ్ధి పొందిందని అంగీకరించేందుకు రౌత్ నిరాకరించాడు. ఫలితాల వెనుక కుట్ర ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు. అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ మహా వికాస్ అఘాడీకి 75 సీట్లు ఎలా రాకుండా పోయాయి..? షిండే సేన కేవలం 20 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా వేసిన ఆయన, “బీజేపీకి 62 నుంచి 70 సీట్లు వస్తాయని మాకు గ్రౌండ్ రిపోర్ట్ ఉంది. అటువంటి పరిణామం సాధ్యం కాలేదు. ఇది మరాఠీ ప్రజల, రైతుల తీర్పు కాదు అన్నారు.
అదే సమయంలో, సంజయ్ రౌత్‌ను మెంటల్ హాస్పిటల్లో చేర్చాలని శివసేన నాయకుడు శీతల్ మ్హత్రే ఎదురుదాడి చేశారు. ‘గదర్ వ్యాఖ్య’పై రౌత్‌పై కూడా మ్హత్రే విరుచుకుపడ్డారు, అసలు శివసేన ఎవరిదో ఇప్పుడు తెలిసిపోతుందన్నారు.