Sania Mirza : విడాకుల తర్వాత మొట్టమొదటి పోస్టుని అప్లోడ్ చేసిన సానియా మీర్జా!
Sania Mirza : గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా లో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరు ఏ రేంజ్ లో వినిపిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.కారణం అందరికీ తెలిసిందే, ఎన్నో అవరోధాలను దాటుకొని పాకిస్తాన్ కుర్రాడు అయిన ప్రముఖ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లాడిన సానియా మీర్జా, అప్పట్లో ఎంత నెగటివిటీ ని ఎదురుకుందో మనమంతా చూసాము. ప్రేమకి బాషా, ప్రాంతం, మతం లేదని నిరూపిస్తూ ఆమె తాను ప్రేమించిన షోయబ్ ని పెళ్లాడింది. కొంతకాలం సుఖంగానే కలిసి ఉన్నారు.
ఒక బిడ్డకి జన్మని కూడా ఇచ్చారు. సానియా మీర్జా బిడ్డకి జన్మని ఇచ్చినప్పటికీ కూడా టెన్నిస్ ని కొనసాగించింది. గత ఏడాది లోనే ఆమె టెన్నిస్ కి శాశ్వతంగా రిటైర్మెంట్ ఇచ్చింది. టెన్నిస్ తో పాటుగా తన వైవాహిక జీవితం కి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. గత కొంతకాలం గా ఆమె ఇండియా లోనే తన కొడుకు తో కలిసి ఉంటుంది.
కానీ షోయబ్ మాలిక్ మాత్రం రీసెంట్ గానే పాకిస్థాన్ హీరోయిన్ సనా జావేద్ ని పెళ్ళాడి ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను అప్లోడ్ చేసాడు. అప్పుడు నెటిజెన్స్ అందరికీ ఆయన సానియా తో విడాకులు తీసుకున్నాడని అర్థం అయ్యింది. కొంతమంది సానియా మోసపోయినందుకు చాలా ఫీల్ అయ్యారు, మీకు మేము ఉన్నాం, ధైర్యం ఉండు అంటూ కామెంట్స్ చేసారు. మరికొంతమంది అయితే వద్దు వద్దు అని చెప్తున్నా కూడా పాకిస్తాన్ వాడిని పెళ్లి చేసుకున్నావ్, మంచి శాస్తి జరిగింది అంటూ వెక్కిరించారు. ఇదంతా పక్కన పెడితే భర్త తో విడాకులు జరిగిన తర్వాత సానియా మీర్జా రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో ని అప్లోడ్ చేసింది. అడ్డం లో తన ముఖాన్ని చూసుకుంటూ ‘రిఫ్లెక్ట్’ అనే పదం తో పోస్టు చేసింది. అంటే దాని అర్థం తనని తాను సమీక్షించుకుంటున్నాను అని.
దీనికి నెటిజెన్స్ క్రింద కామెంట్స్ లో ఇలాంటి సమయం లోనే ధైర్యం గా ఉండడం నేర్చుకోవాలి, మీకు మేము అండగా ఉన్నాం, ధైర్యం గా ఉండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఆమె అప్లోడ్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. విడాకులు తీసుకున్న తర్వాత కూడా చెడుగా తన భర్త గురించి సానియా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం.