Sandeep vanga:రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటించిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌బీర్-రష్మిక జంట నటనతో పాటు, అబ్రర్ అనే ముస్లిమ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించిన బాబి డియోల్ కి మంచి పేరొచ్చింది. తన ముగ్గురు భార్యలపై అత్యాచారం చేసే, సహచరులను చంపేసే నరహంతకుడిగా అబ్రార్ కనిపించాడు.
అయితే అతడు హత్యలు చేయడానికి కారణం పగ ప్రతీకారం. తన తండ్రికి జరిగిన అవమానం భరించలేని అబ్రర్ తన తండ్రి సోదరుడైన స్వస్థిక్ గ్రూప్ అధినాయకుడు బల్బీర్ సింగ్ (రణ్ విజయ్ -రణ్‌బీర్ తండ్రి)ని చంపేందుకు కుట్ర పన్నుతాడు. కానీ ఈ కుట్రను భగ్నం చేస్తూ రణ్ విజయ్ నేరుగా అబ్రార్ ని వెతుక్కుంటూ వెళ్లి చివరికి పీక కోసి చంపేస్తాడు. చివరి సన్నివేశంలో కూడా ఆ ఇద్దరి మధ్యా సోదర ప్రేమను ఎలివేట్ చేసాడు సందీప్ వంగా. నిజానికి అబ్రర్ ఒక శిక్కు కుటుంబం నుంచి వచ్చినవాడు. రణ్ విజయ్ (రణబీర్)కి సోదరుడి వరుస. కానీ సినిమాలో ముగ్గురు భార్యలతో ముస్లిమ్ గా కనిపిస్తాడు.
అయితే ఒక శిక్కు ముస్లిమ్ గా ఎలా మారాడు? దానికి కారణమేమిటి? అని ప్రశ్నించగా, సందీప్ వంగా తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. ఇస్లాం క్రైస్తవంలోకి ప్రజలు మారతారు కానీ, హిందువులుగా మారరు. ఈ పాయింట్ ని ఉపయోగించుకోవాలనుకున్నాను. ముస్లిమ్ పాత్రతో కుటుంబంలో విభిన్న వ్యక్తిత్వాలను తెరపై ఆవిష్కరించగలం. కుటుంబ విస్త్రతి పెరుగుతుంది అని తెలివైన ఆలోచనను రివీల్ చేసాడు. ఇస్లాంలో ఎక్కువమంది భార్యలు ఉండొచ్చు.. సోదరులను కూడా ఎక్కువగా చూడొచ్చు.. కుటుంబ డ్రామా మరింత పెద్దగా మారుతుంది! అని అన్నాడు.
అంతేకానీ.. ముస్లిములను చెడుగా చూపే ఉద్ధేశం తనకు లేదని కూడా అన్నాడు. ఈ సినిమాలో రణబీర్- రష్మిక జంట కులాంతర వివాహం గురించి, కుటుంబం ఎదుటే ఘాటైన ముద్దు సన్నివేశం గురించి సందీప్ వంగా ఓపెనయ్యాడు. వారి మధ్య నిర్లక్ష్యం, ప్రేమలో ఇంటెన్సిటీ కోసమే ఆ సన్నివేశం తెరకెక్కించానని వంగా వివరణ ఇచ్చారు.