JAISW News Telugu

AP Sand : ఏపీలో ఇక ఇసుక ఫ్రీ.. త్వరలో కొత్త విధానం

AP Sand

AP Sand

AP Sand : ఏపీలో ఇకపై కొత్త సాండ్ పాలసీ రానుంది. గతానికి, ప్రస్తుతానికి మార్పు కనబడాలని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లుగా ఇసుక తవ్వకాల్లో జరిగిన దోపిడీ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. కొత్త పాలసీ విధి విధానాలను ఖరారు చేసే క్రమంలో పేదలకు ఉచితంగా ఇసుక అందించాలని యోచిస్తోంది. ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరలపై ఈరోజు సీఎం సమీక్ష నిర్వహించారు. తక్షణమే ఇసుక అందుబాటులోకి రావాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేశారని తెలుస్తోంది.

వైసీపీ హయాంలో నిర్మాణ రంగంలో సంక్షోభం ఏర్పడిందని ఇసుక కొరత, ధరల భారంతో పనుల్లేక కార్మికులు విలవిలలాడారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నపుడు చాలా సార్లు ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. వేల కోట్ల దోపిడీకి పాల్పడి ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చారని విమర్శించారు. అందుకే ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే ఇసుక అందుబాటులోకి తెచ్చి సామాన్యులకు చేరువ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version