JAISW News Telugu

Congress : సేమ్ టు సేమ్..బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్!

Congress

Congress, Revanth Reddy

Congress : నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా అంటారు. ముందు నాగలి ఎలా వెళితే వెనుక నాగలి అలాగే వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది. ఉప ఎన్నికల్లో తాయిలాలు ప్రకటిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఆనాడు కాంగ్రెస్ మొత్తుకున్నా బీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తుకుంటున్నా కాంగ్రెస్ కూడా పెడచెవిన పెడుతోంది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. కంటోన్మెంట్ లో ఇందిరమ్మ ఇళ్లు 6 వేలు ఇస్తామని ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ ఆక్షేపిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని గగ్గోలు పెడుతోంది. కానీ దుడ్డున్న వాడిదే బర్రె అనే నినాదం బీఆర్ఎస్ కు తెలియదా? అధికారంలో ఉన్నప్పుడు వారు చేసింది అదే కదా అని పెదవి విరుస్తున్నారు.

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు అని చెప్పి ఇప్పుడు కంటోన్మెంట్ కు ఎందుకు అంత ప్రాధాన్యం అంటే అక్కడ ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఇలా చేస్తుందంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సాకు చూపి అక్కడ బయట పడాలని భావిస్తోంది. అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాల్సిన ప్రభుత్వమే ఇలా చేయడం తగదని బీఆర్ఎస్ నేతలు వాపోతున్నారు.

కంటోన్మెంట్ లో ఎలాగైనా జెండా ఎగురవేయాలనే తపనతో కాంగ్రెస్ ఉంది. గెలుపు కోసం అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. అన్ని రకాల తాయిలాలు ప్రకటిస్తోంది. ఎలాగైతేనేమీ కంటోన్మెంట్ లో పరువు నిలబడాలి. కాంగ్రెస్ గెలవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ బలమైన వాగ్దానాలు ఇస్తోంది. ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతోనే పార్టీ ఆపసోపాలు పడుతోంది.

కాంగ్రెస్ టార్గెట్ కంటోన్మెంట్ గెలుపే. దీంతోనే కంటోన్మెంట్ లో పాగా వేయాలని చూస్తోంది. దీని కోసమే ఇందిరమ్మ ఇళ్ల స్కీమును ముందుకు తెస్తోంది. కాంగ్రెస్ గెలిస్తేనే ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని చెబుతోంది. ఒక విధంగా బ్లాక్ మెయిల్ కు దిగుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Exit mobile version