Akira Nandan : అచ్చం నాన్నలాగే.. వైరల్ అవుతున్న అకీరా ఫొటోలు

Akira’s photos are going viral
Akira Nandan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అభిమానులకు పిచ్చి. ఆయనదో ప్రపంచం. ఆయన డైలాగ్ చెప్పినా స్టెప్పేసినా దానికో రిథమ్ ఉంటుంది. అలాంటి ట్రెండ్ సెట్ చేసుకున్న హీరో పవన్ కల్యాణ్. తనదైన నటనతో తెలుగు పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పవన్ కల్యాణ్ కు ప్రత్యేకంగా అభిమానులుంటారు. ఇందులో ఎలాంటి అబద్దం లేదు. ఆయన నడిస్తే చాలు అనుకునే వారు చాలా మంది ప్రేక్షకులు ఉండటం ఆయన చేసుకున్న మహాభాగ్యం.
ఇక ఆయన లుక్ కు కూడా భలే ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన వారసుడు అకీరా నందన్ కూడా అచ్చు తండ్రిలాగే మారాడు. సంక్రాంతి పండగ సందర్భంగా తల్లి రేణు దేశాయ్ కొడుకు ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టింది. విపరీతమైన లైక్స్ వస్తున్నాయి. అచ్చం నాన్నలాగే ఉన్న ఫొటోలు చూస్తుంటే పవన్ కల్యాణే గుర్తుకు వస్తున్నాడు.
దీంతో అకీరా సినీ రంగ ప్రవేశం గురించి రకరకాల పుకార్లు వస్తున్నాయి. త్వరలో తెరంగేట్రం చేస్తున్నాడని అంటున్నారు. మొన్నటి దాకా పిల్లాడిలా కనిపించిన అకీరా ఒకేసారి తండ్రిలా సోషల్ మీడియాలో కనిపించడంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నాడనే విషయం అందరికి అర్థమైపోయింది. కానీ ఎవరితో అనేది తెలియడం లేదు.
అకీరాకు సంగీతమంటే ఇష్టం. దీంతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇస్తాడా? హీరోగానే అనేది సందేహమే. ప్రేక్షకులు మాత్రం అకీరా హీరోగానే రావాలని కోరుకుంటున్నారు. మెగా కుటుంబం అకీరా గురించి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. హీరోగా వస్తాడా? లేక మ్యూజిక్ డైరెక్టర్ గానే తన సత్తా నిరూపించుకుంటాడా అనే ఆలోచనలో పడిపోయారు ప్రేక్షకులు.