Samantha : ఆ కోరిక తీర్చుకుంటానంటూ సమంత సంచలన వ్యాఖ్యలు

Samantha

Samantha

Samantha : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సత్తా చాటుతున్నది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన   సిటాడెల్ హనీ-బన్నీ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నది. గతంలో ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన సమంత తన అడుగులు బాలీవుడ్ వైపు వేయాలనుకున్న సమయంలోనే మయోసైటిస్ కు గురైంది. ఈ వ్యాధి కారణంగా సమంత కొంత కాలం సినిమాలకు దూరమైంది. అదే సమయంలో తెలుగులో చేసిన సినిమా ప్లాఫ్ కావడం, మరో వైపు విడాకులు .. ఇలా ఒక్కసారిగా సమంతను సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేశాయి.

ఒకేసారి జీవితంలో ఇన్ని సమస్యలు ఎదుర్కొన్న తొలి హీరోయిన్ సమంతనే కావచ్చు.అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు, మరో వైపు సినిమాలు లేకపోవడం, అప్పటికే పూర్తయిన సినిమాలు ఫ్లాఫ్ కావడంతో సమంత చాలా డిప్రెషన్ కు గురైంది. ఇలా సమస్యలన్నీ చుట్టు ముట్టడతో డిప్రెషన్ కు గురైనట్లు ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. అయితే ఆమెలోని కాన్ఫిడెన్స్ తో సమస్యలన్నీ ఒక్కొక్కటిగా దూరమయ్యాయి. మయోసైటిస్ నుంచి కోలుకున్నది. మళ్లీ సినిమాలపై దృష్టి పెడుతున్నది.

ఇక సమంత సిటాడెల్ సక్సెస్ తర్వాత తన మనసులో మాట వెల్లడించింది. సిటాడెల్ లో తల్లి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే తాను కూడా నిజ జీవితంలో తల్లిని కావాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అయితే తనకింకా వయసు ఉందని, తన కొరికను ఎప్పటికైనా తీర్చుకుంటానని  చెబతుంది. ఇక సిటాడెల్ లో కూతురిగా నటించిన కశ్వీ మజ్మందర్ తెలివైన అమ్మాయని,  సిరీస్ లో హవాభావాలు చక్కగా పలికిందని కితాబిచ్చింది సమంత.

TAGS