Samantha : టాలీవుడ్ లో ఎంతో మంది పెళ్లి చేసుకున్నారు. తరువాత విడిపోయారు. ఆ కోవలో అక్కినేని నాగచైతన్య, సమంత కూడా ఉన్నారు. ఏ మాయ చేశావె సినిమాతో మొదటి సారి వారు కలిసి సినిమా చేసినా ఆటోనగర్ సూర్యతో ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు రహస్యంగా ఉన్నా తరువాత పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు. మరో విషయం ఏంటంటే విడాకులు తీసుకుని అందరిని ఆశ్చర్యపరచారు.
పెళ్లి తరువాత కొన్నాళ్లు అన్యోన్యంగానే ఉన్నా తరువాత ఏమైందో కానీ ఇద్దరు పరస్పర అంగీకారంతోనే విడిపోయారు. దీంతో చాలా మంది వారు విడిపోవడానికి కారణాలేంటనే దానిపై స్పష్టత లేదు. ఇద్దరు ఆమోదపూర్వకంగా విడిపోవడం అందరికి తెలుసు. కానీ దానికి కారణాలేంటనేది మాత్రం తెలియదు. వారి కాపురం మూడు పువ్వులు ఆరు కాయలు అవుతుందని అనుకుంటే మధ్యలోనే పటాపంచలైంది.
సమంత, చైతు విడిపోయాక కూడా వారి పెళ్లి ఫొటో మాత్రం వారి ఇంట్లో అలాగే ఉందట. ఇంటికి వచ్చిన వారంత ఆమె వెళ్లిపోయాక ఫొటో ఎందుకు అని అడిగారట. ఇప్పటికి కూడా వారిద్దరు టచ్ లోనే ఉంటున్నట్లు సమాచారం. ఇలా నాగచైతన్య, సమంత గురించి రకరకాల పుకార్లు వస్తుంటాయి. ఇందులో నిజమెంత? అబద్ధమెంతో తేలడం లేదు. ఆ ఫొటోలో సమంతతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉండటంతో ఫొటోను తీయడం లేదని అంటున్నారు.
సమంత, నాగచైతన్య చూడటానికి అందమైన జంట. అందుకే అందరు వారి జంటను చూస్తే ముచ్చటేస్తోందని అనేవారు. వారిద్దరు విడిపోయాక కూడా చాలా మంది అది నిజం కాదని అనుకున్నారు. కానీ నిజంగానే వారు విడిపోవడం జీర్ణించుకోలేకపోయారు. సమంత, చైతు విడిపోయాక వారు కలవాలని చాలా మంది కోరుకున్నారు. కానీ అది కుదరలేదు.