Samantha : వారిద్దరిని దత్తత తీసుకోనున్న సమంత.. ఈ కారణంతోనే డిసైడ్ అయ్యిందా?
Samantha : అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లిన సమంత రూత్ ప్రభు ఎంతో కాలం అక్కడ ఉండలేకపోయింది. వ్యక్తిగత కారణాలతో చైతన్యకు విడాకులు ఇచ్చి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఒంటరి జీవితం గడుపుతుంది. ఇక ఆమె విడాకుల నుంచి ఆమెపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ సోషల్ మీడియాకు వైరల్ పంట పండిస్తున్నాయి.
సమంత కొన్నాళ్లుగా వయోసైటిస్ తో భాధపడుతుంది. అయితే జీవితం ముగిసేలోగా పిల్లా పాపలను చూడాలని రెండో పెళ్లి చేసుకోవాలని ఆమె ఇంట్లో వారు ఒత్తిడి తెస్తున్నారు. ఒంటరి జీవితం ఇంకా ఎన్నాళ్లని, జంటగా మారాలని సూచనలు చేస్తున్నారు. కానీ సమంత మాత్రం దానికి ససేమీరా అంటుంది.
కుటుంబ సభ్యుల ఒత్తిడి పెరుగుతుండడంతో ఆమె ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒంటరిగా ఉండద్దని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాబట్టి పెళ్లిని పక్కన పెట్టి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోవాలని అనుకుంటుందని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఖుషి తర్వాత తన అనారోగ్యం కారణంగా సినిమాకు గుడ్ బై చెప్పిన సమంత రెస్ట్ మోడ్ లో ఉంది. ఆరోగ్యంపైనే పూర్తి ఫోకస్ పెట్టాలని ఆమె అనుకుంటుందట. అందుకే ఆమె ఇటీవల జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో కనిపించారు. అయితే పూర్తిగా ఇంట్లో కూర్చొని తింటే కొండలైనా తరుగుతాయని భావించిన ఆమె సైడ్ ఇన్ కమ్ గా యాడ్స్ చేస్తుంది. ఇటీవల దీపావళికి ‘బల్గేరి జ్యువల్లరీస్’ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ షూట్ చేసింది.