JAISW News Telugu

Samantha : రామ్ చరణ్ కి అత్తయ్య గా నటించబోతున్న సమంత..డైరెక్టర్ పై మండిపడుతున్న ఫ్యాన్స్!

Samantha who is going to act as Ram Charan's aunt

Samantha who is going to act as Ram Charan’s aunt

Samantha : సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా సమంత పేరు ముందు వరుసలో ఉంటుంది. మొదటి సినిమాతోనే భారీ హిట్ ని అందుకోని అటు అందం పరంగా, నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన సమంత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ అనతి కాలం లోనే పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, కోలీవుడ్ లో కూడా ఆమె వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి అక్కడ కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది.

అయితే రంగస్థలం చిత్రం తర్వాత ఆమె చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్ళింది. రెగ్యులర్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, ముఖ్య పాత్రలు, విలన్ పాత్రలు ఇలా ఎన్నో వైవిద్యభరితమైన క్యారెక్టర్స్ చేస్తూ ఇండస్ట్రీ లో దూసుకెళ్లింది. కేవలం సౌత్ ఇండియన్స్ ని మాత్రమే కాకుండా నార్త్ ఇండియన్స్ ని కూడా ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 ద్వారా అలరించింది.

ఇప్పుడు అతి త్వరలోనే ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ద్వారా అమెజాన్ ప్రైమ్ లో మన ముందుకు రాబోతుంది.ఇదంతా పక్కన పెడితే త్వరలోనే రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది. త్వరలోనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా నటించబోతున్నాడు. ఆయన డేట్స్ కూడా ఖరారు అయిపోయిందట. అయితే ఈ చిత్రం లో ఒక పవర్ లేడీ క్యారక్టర్ కూడా ఉంటుందట.

ఆ క్యారక్టర్ కోసం బుచ్చి బాబు సమంత ని రీసెంట్ గానే కలిసి అడిగాడట. క్యారక్టర్ ఆమెకి నచ్చింది కానీ, ఆ సినిమాలో ఆమె రామ్ చరణ్ కి వరుసకు అత్త అవుతుందట. ఇది విన్న వింటేనే ‘ఏంటి రామ్ చరణ్ కి నన్ను అత్తగా ఊహించుకున్నావా..ఎలా కనిపిస్తున్నాను నేను నీ కంటికి..నువ్వు పది కోట్లు ఇచ్చినా ఈ సినిమా నేను చెయ్యను’ అని తెగేసి చెప్పి పంపింది అట. ఈ విషయం సోషల్ మీడియా లో లీక్ అవ్వడం తో ఫ్యాన్స్ బుచ్చిబాబు ని ఘోరంగా తిడుతున్నారు.

Exit mobile version