Samantha:టాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకోవడమే కాకుండా స్టార్ డమ్‌ని సొంతం చేసుకున్న సమంత ఇటీవల రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి రొమాంటిక్ ఫ్యామిలీ లవ్ స్టోరీ `ఖుషి`లో నటించిన విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఈ ఏడాది సెప్టెంబర్ 1న పాన్ ఇండియా ఇండియా ఫిల్మ్‌గా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.
అయితే సమంత మాత్రం మయోసైటీస్ ట్మీట్మెంట్ కోసం సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చేసింది. సినిమాలకు దూరంగా ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ కోలుకున్న సామ్ మళ్లీ సోషల్ మీడియాలో యాక్టీవ్ అయింది. నిత్యం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లో ఉండే సమంత తాజాగా ఆదివారం అభిమానుల కోసం సోషల్ మీడియా ఇన్ స్టాలో యాక్టీవ్ అయింది. తన కోసం చాలా రోజులుగా ఎదురు చూసిన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఇన్ స్టా వేదికగా తనని ఏదైనా అడిగేయొచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత చాలా స్మార్ట్‌గా సమాధానం చెప్పడం ఆకట్టుకుంటూ ఎట్టింట వైరల్‌గా మారింది. ఓ అభిమాని `మళ్లీ మీకు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అని ప్రశ్నించాడు. దీనికి వెంటనే స్పందిన సామ్ ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. 2023లో విడుదల చేసిన విడాకుల రికార్డు కాపీని షేర్ చేసింది. దానికి ఒక స్మైలీ ఎమోజీని జోడించింది. అంతే కాకుండా `తాజా లెక్కల ప్రకారం బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది` అంటూ స్మార్ట్‌గా తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. దీంతో సామ్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.