Samantha Second Marriage : నాగ చైతన్య మీద కోపంతో రెండో పెళ్లికి సిద్ధమైన సమంత..!

Samantha Second Marriage

Samantha Second Marriage

Samantha Second Marriage : అక్కినేని నాగ చైతన్య మరియు సమంత విడాకులు తీసుకొని చాలా కాలం అయ్యింది. కానీ వీళ్లిద్దరి గురించి సోషల్ మీడియా లో రోజుకి ఒక రూమర్ రావడం మాత్రం ఆగడం లేదు. నిన్న మొన్నటి వరకు నాగ చైయితన్య ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారని టాక్ నడించింది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో ఎవరికీ తెలియదు కానీ వీళ్ళు మాత్రం కలిసి చాలా చోట్ల తిరిగారు.

కానీ సమంత మాత్రం సోలో లైఫ్ ని ఇన్ని రోజులు గడుపుతూ వచ్చింది. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మానసికంగా ఎంతో కృంగిపోయింది. ఆ ఆవేదన నుండి ఆమె బయటకి వచ్చేందుకు శ్రమకు మించి జిమ్ లో వర్కౌట్స్ చేసింది. అలా చెయ్యడం వల్ల కండరాల సమస్య ఏర్పడి మయోసిటిస్ అనే వ్యాధికి గురి అయ్యింది. ప్రాణాంతక వ్యాధులలో ఒకటిగా పరిగణించే ఈ వ్యాధి సోకి మృత్యువుతో పోరాడి జయిచింది.

కానీ డాక్టర్లు కొంతకాలం విశ్రాంతి తీసుకోమని సూచించడం తో ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. త్వరలోనే రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం గా ఉంది. ఇదంతా పక్కన పెడితే సమంత అతి త్వరలోనే రెండవ పెళ్లి చేసుకునేందుకు తయారైంది అని సోషల్ మీడియా లో ఒక వార్త ప్రచారం లో ఉంది. సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు కాకుండా, తన బందువులకు సంబంధించిన వ్యక్తిని సమంత కోసం ఆమె అమ్మ అడిగిందట. సమంత కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఈ ఏడాది లోనే ఆమె పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయట. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ముందే ఆమె వివాహం జరిగిపోతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సమంత త్వరలోనే ప్రకటిస్తుందట. వాస్తవానికి అయితే సమంత సోలో గానే ఉండిపోవాలని అనుకుంది. కానీ నాగ చైతన్య రెండవ పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవ్వడం తో ఆమె అతని మీద పంతం తో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

TAGS