Samantha : సమంత సంక్రాంతి సోలో సెలబ్రేషన్స్.. ఏం చేసిందో తెలుసా?

Samantha Sankranti Solo Celebrations
Samantha Sankranti Celebrations : వయోసైటిస్ తో బాధపడుతున్న సమంత రూత్ప్రభు సినిమాలకు గ్యాప్ ఇచ్చిందని మనకు తెలిసిందే. ఆరోగ్యంపై ఫోకస్ చేస్తూ ఆధ్యాత్మికం వైపునకు వెళ్తుంది. ఇటీవల ఒక చిత్ర నిర్మాణ సంస్థను ప్రకటించిన ఆమె ఆ సంస్థ ద్వారా సినిమాలను నిర్మిస్తానని చెప్పింది. సమంత ఫ్యామిలీ మొత్తం చెన్నైలో ఉండగా.. సమంత మాత్రం ఇక్కడే సింగిల్ గా ఉంటుందట. సినిమాలకు దూరమైన ఆమె తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తుంది. పొంగల్ ను ఎలా జరుపుకున్నానో చూడండి.. అంటూ కొన్ని పిక్స్ ఇన్ స్టాలో షేర్ చేసింది.
సంక్రాంతి రోజున తాను ఏం చేసానో చెప్పింది. తాను వేసిన ముగ్గు, గాలిపటంతో ఆటలు, తన పెట్స్, లైటింగ్ తో డెకరేట్ చేసిన ఇల్లు.. ఇలా కొన్ని పిక్స్ షేర్ చేసి ఒక్కో ఫొటోకు ఒక్కో కొటేషన్ ఇచ్చింది. ఈ పిక్స్ షేర్ చేసిన సామ్ ‘ఇదే నా సంక్రాంతి, నేను ఈ రోజు హ్యాపీగా ఉన్నాను గాలిపటంతో ఆడుకున్నా, భోగిమంటల్లో చెడును తగలబెట్టా, చక్కగా తలస్నానం చేశా, నా పెట్స్ తో ఆడుకున్నా, ఒక చిన్న ముగ్గు వేశా, అందమైన పూలతో ఆడుకున్నా. నా ఇంటిని లైటింగ్ తో డెకరేట్ చేశా’ అని రాసుకుంది.
సమంత పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫొటోల్లో ఆమె కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ కనిపించకపోవడంతో ఆమె ఒంటరిగానే ఉంటుందని అర్థం అవుతుంది. మరి ఇంట్లో పని వాళ్లు కూడా లేరా? అన్న అనుమానం కలుగుతుంది. ఇక అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు.
View this post on Instagram