Samantha : మరో కొత్త ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న సమంత!

Samantha is struggling with another new health problem
Samantha : సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత పేరు కచ్చితంగా ఉంటుంది. దాదాపుగా సౌత్ స్టార్ హీరోలందరితో కలిసి నటించిన ఈమె గత కొంతకాలం నుండి మయోసిటిస్ వ్యాధి సోకడం వల్ల ట్రీట్మెంట్ తీసుకుంటూ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. రీసెంట్ గా ఆమె పూర్తిగా ఆ వ్యాధి నుండి కోలుకోవడం తో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం గా ఉంది.
గత ఏడాది ఈమె అమెజాన్ ప్రైమ్ కోసం ‘సిటాడెల్’ అనే యాక్షన్ వెబ్ సిరీస్ లో నటించింది. అతి త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఇది కాసేపు పక్కన పెడితే సమంత మరో సమస్య తో బాధపడుతుంది అట. ఆమెకి మొదట్టి నుండి పూలు అంటే తెగ ఎలెర్జీ ఉంటుందట. దాని వల్ల ఆమెకి ర్యాషెస్ కూడా వచ్చేది అట. దీని ట్రీట్మెంట్ కోసం ఎంత ప్రయత్నం చేసినా ఆమెకి ఎలెర్జీ మాత్రం తగ్గడం లేదట. దీంతో ఆమె పూలను పూర్తిగా దూరం పెట్టేసింది.