Samantha : సమంతా ఏం చేసినా సంచలనమే..పెళ్లి నాటి గౌనును ఇలా చేసిందేంటి?
Samantha : ప్రముఖ హీరోయిన్ సమంత ఏం చేసినా సంచలనమే. ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. ఏ పని చేసినా తనకు తగిన ప్రచారం రావాలని చూసుకుంటుంది. పబ్లిసిటీ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఈనేపథ్యంలో ఆమె ధరించే దుస్తులు, నగలు కూడా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె తన గౌనును రీ డిజైనింగ్ చేయించి వాడుకోవడం చర్చనీయాంశం అయింది.
ఏ మాయచేశావే తో తెలుగు తెరకు పరిచయమైన సమంత 2017లో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుంది. కొన్నాళ్లపాటు కాపురం చేసిన వీరు 2021లో వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుని ప్రస్తుతం వేరువేరుగా ఉంటున్నారు. సమంత వ్యక్తిగత వైద్యం కోసం అమెరికా వెళ్లింది. తన సినిమాలన్ని రద్దు చేసుకుని అమెరికా వెళ్లడం గమనార్హం.
గోవా వేదికగా వారి పెళ్లి వేడుక జరిగింది. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. పెళ్లిలో రామానాయుడి సతీమణి చీరను సమంత రీమోడల్ చేయించి కట్టుకుంది. క్రిస్టియన్ సంప్రదాయంలో తెల్లటి గౌనును ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవడం విశేషం. వీరిద్దరు విడిపోవడంతో పెళ్లి గౌనును ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంది.
వారిద్దరు విడిపోయాక వెడ్డింగ్ గౌనును తాజాగా సమంత మరింత నలుపు రంగులోకి మార్పించి ఉపయోగించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. సమంత తన వ్యక్తిగత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని అంటున్నారు. పెళ్లి గౌనును రీమోడల్ చేయించడమే చర్చనీయాంశంగా మారుతోంది.
ఈ ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో హల్ చల్ చేస్తున్నాయి. అలవాట్లు మార్చుకోవడం, జీవనశైలిని స్థిరంగా ఉంచుకోవడం వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తుంటుంది. ఆమెపై చూపుతున్న అభిమానానికి అందరికీ ధన్యవాదాలు అని ట్వీట్ చేసింది.