JAISW News Telugu

Government : ఇంట్లో పిల్లలందరికీ తల్లికి వందనం.. స్కూళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం  

Government :  తల్లికి వందనం పథకంపై విద్యాశాఖ మంత్రి లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అంత మందికీ తల్లికి వందనం పథకం ఇస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ ఇస్తామన్నారు. ఆ పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా కోతలు లేకుండా రూ.15 వేలు అందజేస్తామన్నారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో 72 వేల మంది విద్యార్థులు తగ్గారన్నారు. ఇతర రాష్ట్రాల్లోని విద్యా విధానాలపై అధ్యయనం చేసి, మంచి విధానాలను ఏపీలో అమలు చేస్తామన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో కొత్త సంస్కరణలు తీసుకొస్తామన్నారు.  పాదయాత్రలో చాలా మందిని కలిసినప్పుడు రూ.30-40 వేలకు పాత కారు తీసుకుంటే తెల్లరేషన్‌ కార్డు రద్దు చేసి పథకాలు నిలుపుదల చేశారనన్నారు.  వీటన్నింటిపైనా మంత్రులందరితో చర్చిస్తున్నాం. తల్లికి వందనం పకడ్బందీగా అమలు చేస్తాం. ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరానికి నియామక ప్రక్రియపూర్తి చేస్తాం. పక్క రాష్ట్రాల్లో కూడా ఏమి జరుగుతుందో చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీల్లో మోడల్స్‌ ఉన్నాయి. అధికారులు నివేదిక అందించారు. మేం కూడా వెళ్లి చూడాలనుకుంటున్నాం. మన రాష్ట్రానికి ఏ మోడల్‌ సూటవుతుందో చూసి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంఘాల ముందు పెట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తాం’ అని లోకేష్  అన్నారు.

గత ప్రభుత్వం తీసుకువచ్చిన టోఫెల్‌ విధానంపై ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకూ మంత్రి లోకేశ్‌ సమాధానమిచ్చారు. ‘టోఫెల్‌ శిక్షణలో ప్రధానమైన సమస్య అమెరికన్‌ యాక్సెంట్‌ ఉంటుంది. దాంతో మన పిల్లలకి అర్థం అవడం లేదు.  ఉపాధ్యాయులు నేర్పలేకపోతున్నారు. ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలుకు మేం వ్యతిరేకం కాదు. కానీ, ఉపాధ్యాయులకు శిక్షణ లేకుండా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్‌ కాదన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి ప్రతికూల ప్రతిస్పందన దృష్ట్యా టోఫెల్‌పై సమీక్షిస్తామని అన్నారు.

Exit mobile version