Tiger 3 Review and Rating : సల్మాన్ ఖాన్ ”టైగర్ 3” రివ్యూ అండ్ రేటింగ్!
Tiger 3 Review and Rating : బాలీవుడ్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు.. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్స్ అందుకుని స్టార్ హీరోగా ఎదిగాడు.. కానీ ఈ మధ్య కాలంలో మిగిలిన హీరోల కంటే సల్మాన్ ఖాన్ రేసులో వెనుక బడ్డాడు.. సల్మాన్ నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వలేక పోవడంతో ఈసారి అయినా మంచి సూపర్ హిట్ ను అందుకోవాలని ఫ్యాన్స్ అంత కోరుకున్నారు.. మరి ఈ క్రమంలోనే ఈయనకు హిట్ ఇచ్చిన టైగర్ ఫ్రాంచైజీనే నమ్ముకుని సినిమా చేసాడు. టైగర్ 3 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. దీపావళి కానుకగా రిలీజ్ అయినా ఈ సినిమాకు రివ్యూ అండ్ రేటింగ్ ఇప్పుడు తెలుసుకుందాం..
నటీనటులు :
సల్మాన్ ఖాన్,
కత్రినా కైఫ్
ఇమ్రాన్ హష్మీ
రేవతి
రణ్వీర్ షోరే తదితరులు..
డైరెక్టర్ : ఆదిత్య చోప్రా
నిర్మాత : ఆదిత్య చోప్రా
సంగీతం : తనూజ్ టికు
సినిమాటోగ్రఫీ : అనయ్ గోస్వామి
యష్ రాజ్ ఫిలిమ్స్ పై స్పై యూనివర్స్ లో భారతీయ గూఢచారిగా సల్మాన్ ఖాన్ నటించిన ”ఏక్ థా టైగర్’, టైగర్ జిందా హై, సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. దీంతో టైగర్ ఫ్రాంచైజీగా ఈ సినిమా తెరకెక్కింది. ముందు నుండి భారీ అంచనాల నెలకొనగా దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది.
కథ :
టైగర్ అలియాస్ అవినాష్ (సల్మాన్ ) ఒక రా ఏజెంట్ గా పని చేస్తుంటాడు.. తన భార్య మాజీ ఐఏఎస్ ఏజెంట్ జోయా (కత్రినా) తో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న తరుణంలో గోపి (రణ్వీర్ షోరే)ను తీవ్రవాదుల నుండి కాపాడే క్రమంలో మిషన్ ను స్టార్ట్ చేస్తాడు.. ఇతడు మరణించే ముందు జోయా డబుల్ ఏజెంట్ అని చెప్పడంతో ఆ తర్వాత జరిగిన పరిణామాలే మిగిలిన కథ.. జోయా, టైగర్ కలిసి పాకిస్థాన్ కు చెందిన ఒక సూట్ కేసును దొంగిలించగా అందులో ఏముంది?ఇండియా, పాకిస్థాన్ ప్రభుత్వాలు వారి కోసం ఎందుకు వేట మొదలెట్టాయి? వీరిద్దరిలో దేశద్రోహులు ఎవరు? అనేది మిగిలిన కథ..
విశ్లేషణ : హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కొన్ని చోట్ల మాత్రమే ఆకట్టుకుంది.. సినిమాలో మెయిన్ పాయింట్ బాగుంది.. డైరెక్టర్ ఆదిత్య చోప్రా సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా తీర్చిదిద్దాడు. సల్మాన్ ఖాన్ నటన కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది.. కానీ తీసుకున్న పాయింట్ బాగున్నా కథలో డెప్త్ లేదు.. కొద్దిగా ఆడియెన్స్ ను కన్ఫ్యూజ్ చేసేలా ఉంది..
నటీనటుల పర్ఫార్మెన్స్ : ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ వన్ మ్యాన్ షో చేసినట్టు అనే చెప్పాలి.. ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు.. అద్భుతంగా నటించి సినిమాలో తన పాత్రకు తగ్గట్టు తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకున్నాడు.. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా సల్మాన్ నటన ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉంది.. సల్మాన్ తో పాటు షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ లో ఎంట్రీ ఇవ్వడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.. ఈమె టవల్ ఫైట్ సీన్ మాత్రం ఆమె ఫ్యాన్స్ తో పాటు మిగిలిన వారిని సైతం ఆకట్టుకుంది.. అలాగే విలన్ గా నటించిన ఇమ్రాన్ హష్మీ ఉన్నంత మేర బాగానే నటించాడు.. మిగిలిన పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి..
టెక్నీకల్ పర్ఫార్మెన్స్ : సాంకేతిక విభాగం పరంగా చుస్తే వీరి వర్క్ చాలా బాగుంది.. బీజీఎమ్ ఆకట్టుకునేలా ఉంది.. సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలిచేలా చేసాడు.. కీలక సన్నివేశాల్లో కెమెరా వర్క్ బాగుంది.. నిర్మాణ విలువలు బాగున్నాయి.. స్టోరీని మరికొద్దిగా ఎఫెక్టివ్ గా రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది..
ప్లస్ పాయింట్స్ :
స్టార్ క్యాస్ట్
ప్రొడక్షన్ వాల్యూస్
యాక్షన్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
లాజిక్స్ మిస్ అవ్వడం
సహజత్వం లేకపోవడం
సాంగ్స్
రేటింగ్ : 2.75/5