Salman Khan : వరుస బెదిరింపులు.. నాలుగంచెల భద్రత నడుమ సల్మాన్ సినిమా షూటింగ్  

Salman Khan

Salman Khan

Salman Khan : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు వరుస బెదిరింపులు వస్తుండటంతో ఆయనకు భద్రతను పెంచుతున్నారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుల నుంచి సల్మాన్ ఖాన్‌కు తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తాజాగా ముంబై ట్రాఫిక్ హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్‌కు లారెన్స్ బిష్ణోయ్‌కి సంబంధించిన వారని, సల్మాన్ ఖాన్ తమకు రూ.5కోట్లు చెల్లించకపోతే  వెంటనే చంపేస్తామని బెదిరించారు. దాంతో పాటు తాజాగా ‘మై సికిందర్ హూన్’ పాట గీత రచయితను చంపేస్తానని మెసేజ్ రాసింది. సల్మాన్ ఖాన్‌కు ఎవరైనా సహాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా వారు హెచ్చరించారు. దీంతో సల్మాన్ ఖాన్ కూడా షూటింగుల్లో పాల్గొనాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘సికిందర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. నగరంలోని రాయల్‌ హోటల్‌గా పేరొందిన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరగనుంది. అయితే సల్మాన్ ప్రాణాలకు ముప్పు ఉన్న దృష్ట్యా అతడికి రక్షణగా 70 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్న సంగతి తెలిసిందే. వీరిలో NSG కమాండోలు, పోలీసు సిబ్బంది, వ్యక్తిగత భద్రతా బలగాలు ఉన్నారు. ఈ క్రమంలో సల్మాన్‌కు నాలుగు లేయర్ల భద్రత కల్పించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సల్మాన్ కు వై ప్లస్ భద్రతను కల్పించిన సంగతి తెలిసిందే. సల్మాన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని సెక్యూరిటీ సిబ్బంది హోటల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

TAGS