Salman khan:మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ అన్నయ్య అర్బాజ్ ఖాన్ ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్నాడు. మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను అతడు వివాహం చేసుకున్నాడు. అర్బాజ్ మొదటి వివాహం మలైకా అరోరాతో. మలైకా, అర్బాజ్‌లు 19ఏళ్ల దాంపత్య జీవనం తర్వాత విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ ఇద్దరూ తమ కొడుకు కోసం ఎప్పుడూ కలిసి కనిపిస్తారు. అర్బాజ్ రెండవ వివాహం తర్వాత కూడా సల్మాన్ మలైకాను ఖాన్ కుటుంబంలో ఒక భాగంగా పరిగణించాడు. మలైకాతో తమకు కలతలు లేవని నిరూపించాడు. క్రిస్మస్ సందర్భంగా సల్మాన్ మలైకాకు ఓ గిఫ్ట్ పంపాడు.
అందుకు సంబంధించిన ఓ ఫోటోను మలైకా సోషల్ మీడియాలో షేర్ చేసింది. గిఫ్ట్ తో పాటు మలైకా కోసం సల్మాన్ ఓ స్పెషల్ నోట్ కూడా పంపాడు. దీన్నిబట్టి చూస్తే మల్లా ఖాన్ ఫ్యామిలీతో ఇంకా కనెక్ట్ అయి ఉందనే చెప్పాలి. `మీకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అచంచలమైన స్నేహం మద్దతు మా ప్రశంసలకు చిహ్నంగా, మేము ఈ చిన్న అడ్డంకిని సృష్టించాము. మీ ఉనికి మాకు వెలుగునిచ్చినట్లే, మీ ముఖంలో చిరునవ్వును తీసుకురావాలి` అని ఆ లేఖలో రాసి ఉంది.
అర్బాజ్ ఖాన్ రెండవ వివాహం తర్వాత మలైకా అరోరా పేరు ప్రముఖంగా హెడ్ లైన్స్‌లోకి వచ్చింది. అర్బాజ్ – షురా వివాహానికి మలైకా హాజరు కాలేదు కానీ తన కుమారుడు అర్హాన్ ఖాన్‌ను పంపింది. అర్హాన్ తన తండ్రి వివాహానికి హాజరయ్యాడు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అర్హాన్ వేదికపై పెర్ఫామ్ చేస్తూ కనిపించాడు. అర్బాజ్ – షురా వివాహం అర్పితా ఖాన్ ఇంట్లో జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, కొంతమంది ప్రత్యేక స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.