Employees : ఉద్యోగుల‌కు జీతాలు.. జగన్ కంటే బాబే బెటర్..

Employees

Employees salaries Babu Govt

Employees Salaries : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ దిగిపోయినా ఆయన పాలన నడుస్తుందా? అని ఉద్యోగులు అనుకుంటున్నారు (అంత కాకపోయినా). ఇందుకు కారణం కూడా లేకపోలేదట. ఉద్యోగుల్లో కొందరికి ఇప్పటికీ జీతాలు పడలేదట. ఐదు రోజులు (అక్టోబర్ 05) గడిచినా సాలరీ క్రెడిట్ కాకపోవడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారట. కూటమి ప్రభుత్వంలో ఫస్ట్ మంత్ మాత్రమే 1వ తేదీ జీతం పడింది. ఆ తర్వాత 3వ తేదీకి వెళ్లింది. ఆ తర్వాత నాలుగు ఇలా 10వ తేదీ వరకు కూడా కొందరికి జీతాలు పడుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసమేనా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుందని ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. నెలాఖ‌రుకు రూ. 3వేల కోట్లను ప్రభుత్వం అప్పుగా తెచ్చింది.

ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పడం కాదు. ఆచరణలో కూడా చేసి చూపాలి. ఉద్యోగుల‌కు జీతాలు వేయడం ఆలస్యమైతే వ్యతిరేక పెరగడానికి తక్కువ సమయం పడుతుంది. త‌మ డిమాండ్ల సాధ‌న‌కు ఉపాధ్యాయులు, ఉద్యోగులు రోడ్డెక్కలేదు. ఇప్పుడే ఏర్పడిన ప్రభుత్వం, అందునా వరదలు కొంచెం ఇబ్బంది పెట్టాయని అందరూ అనుకుంటున్నారు. కూట‌మి ప్రభుత్వం వేతనాలు ఇవ్వడానికే తిప్పలు ప‌డ‌డం చూస్తే, ఇక డిమాండ్లను ఎలా పరిష్కరిస్తుందని సంశయంలో ఉన్నారు కొంత మంది ఉద్యోగ జేఏసీ నేతలు. 1వ తేదీ జీతాలు ఇస్తే అదే భాగ్యం అనుకుంటున్నారు. కూట‌మి ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచించాలని అంటున్నారు.

నిజానికి ఈ సారి వరదలు రావడం విజయవాడ మొత్తం ఆందోళనకరంగా మారడంతో కొంతలో కొంత లేట్ అయినట్లు కూటమి వర్గాల నుంచి తెలుస్తుంది. పదవిలోకి వచ్చిన కొత్తలో జమలు, ఖర్చుల గురించి తెలుసుకోవడం వల్ల కొంచెం లేటవడం ఏ ప్రభుత్వానికైనా కామనే. ఇది ప్రతీ కొత్త ప్రభుత్వానికైనా ఏర్పడే సమస్యే. కొన్ని రోజులైతే ఈ సమస్య ఉండదని 31కే జీతాలు పడతాయని కొందరు ఉద్యోగ జేఏసీ నేతలు చెప్తున్నారు.

TAGS