JAISW News Telugu

Dunki Vs Salaar:PVRని నిషేధించిన `స‌లార్` నిర్మాత‌లు?

Dunki Vs Salaar:స‌లార్ వ‌ర్సెస్ డంకీ! వార్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈరోజు షారూఖ్ న‌టించిన డంకీ విడుద‌ల‌వుతుండ‌గా, రేపు (22డిసెంబ‌ర్) ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది. దీంతో ఇరు సినిమాల పంపిణీ కోసం దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌ను షేరింగ్ ప్రాతిప‌దిక‌న ఒప్పందాలు చేసుకున్నారు. 50: 50 షేరింగ్ ఉంటుంద‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. కానీ ఇప్పుడు ప్ర‌ఖ్యాత పీవీఆర్ ఐనాక్స్ చైన్ తో స‌లార్ నిర్మాత‌లకు పొస‌గ‌లేద‌ని తెలిసింది. విభేధాలు బ‌య‌ట‌పడ్డాయ‌ని తాజా మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇంత‌కీ PVRతో స‌లార్ మేక‌ర్స్ స‌మ‌స్యేంటి? అన్న‌ది తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

ప్రభాస్ సలార్ ఈ క్రిస్మ‌స్ సీజ‌న్ లో అత్యంత భారీ క్రేజ్ తో విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే స‌లార్‌`తో హోంబలే ప్రొడక్షన్స్ పెద్ద అడుగు వేసింది. విడుదలకు రెండు రోజుల ముందు, దక్షిణాది రాష్ట్రాల్లోని పివిఆర్ ఐనాక్స్ – మిరాజ్ సినిమాస్ స్క్రీన్ల‌ నుండి తమ సినిమా విడుదలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రొడక్షన్ హౌస్ హోంబ‌లే ప్రకటించింది. ఉత్తర భారతదేశంలో `సలార్ వ‌ర్సెస్ డంకీ వివాదం తీవ్రంగా న‌లుగుతోంది. ఇరు సినిమాల పోటీతో స్క్రీనింగ్‌ల పరంగా స‌లార్ కి అన్యాయం జ‌రుగుతోంది. దీంతో స‌లార్ మేక‌ర్స్ ఈ నిర్ణయం తీసుకున్నార‌ని తెలిసింది.

తాజా క‌థ‌నాల‌ ప్రకారం, “హోంబాలే ప్రొడక్షన్స్, SRK రెడ్ చిల్లీస్ .. మల్టీప్లెక్స్‌లు – సింగిల్ స్క్రీన్‌ల పంప‌కం విష‌య‌మై గత వారంలో ఒకరితో ఒకరు చర్చలు జరిపారు. స‌లార్ నిర్మాతలు SRK ని కూడా కలిశారు. రెండు చిత్రాలకు 50-50 ప్రాతిప‌దిక‌న థియేట‌ర్ల‌లో రిలీజ్ కి ఏకాభిప్రాయం కుదిరింది. స్క్రీనింగ్ హక్కులు చెరిస‌గం అని అన్నారు. అయితే ఈ అగ్రిమెంట్ ని కొంద‌రు పాటించడం లేదని హోంబ‌లే ఆరోపించింది. అంతకుముందు నిర్మాత విజయ్ కిరంగ‌దూర్ స్క్రీనింగ్ కోసం యుద్ధం చేయకూడదని భావించిన‌ట్టు ధృవీకరించారు. 50-50 స్క్రీనింగ్ హక్కులకు అంగీకరించారు.

కానీ పీవీఆర్ చైన్ తో, మిరాజ్ తో అలా జ‌ర‌గ‌డం లేదు. ఒక సోర్స్ ప్ర‌కారం..`ఏకాభిప్రాయం కుదిరి ఒప్పందం ఉన్నప్పటికీ, స‌లార్ పై కుట్ర జ‌రిగింది. బ్యాక్ అండ్ పుష్ పుకార్లు వినిపించాయి. ఉత్తర భారతదేశంలో సింగిల్ స్క్రీన్‌లను `సలార్ కంటే డంకీని ప్రదర్శించడానికి అనుకూలంగా ప‌రిస్థితులు మారాయి. ఉత్తర భారతదేశంలో స‌లార్ కి బుకింగ్‌ల ట్రెండ్ చాలా గొప్పగా ఉంది. అయితే ఇప్పుడు డంకీకి స‌లార్ కంటే ఎక్కువ స్క్రీన్లు రావడంతో ఉత్తరాదిలో అసమతుల్యత స్పష్టంగా కనిపిస్తోంది. బుకింగ్ వివరాల ప్రకారం, PVRఐనాక్స్ ఉత్తర భారతదేశంలోని వారి సింగిల్ స్క్రీన్ ప్రాపర్టీలన్నింటినీ డంకీకి కేటాయించింది. దీంతో సౌత్‌లో కూడా సినిమా ప్రదర్శనను ఉపసంహరించుకోవాలని హోంబలే ఫిలింస్ కిరంగ‌దూర్ నిర్ణయించుకున్నారు.

ఇది ఎగ్జిబిటర్‌లను ఎలా ప్రభావితం చేస్తుంది?

దక్షిణాదిలో 5400 స్క్రీన్‌లు ఉండ‌గా, ఇందులో, PVR ఐనాక్స్ వాటా దాదాపు 45-50శాతం. ఆ మేర‌కు మెజారిటీ స్క్రీన్‌లను కలిగి ఉంది. ఈ చర్యతో స‌లార్ ఎగ్జిబిటర్లు ఫుట్‌ఫాల్స్‌లో పెద్ద తగ్గుదలని చూస్తారు. సలార్: సీజ్ ఫైర్- పార్ట్ 1 అడ్వాన్స్ బుకింగ్ ప‌రంగా భారత్‌లో ట్రెండ్ అసాధార‌ణంగా ఉంది. ఒక‌ డేటా ప్రకారం.. మంగళవారం వరకు భారతదేశంలో ముందస్తు బుకింగ్‌లు రూ. 13.70 కోట్లకు పైగా ఉన్నాయి. 6 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. సలార్ తెలుగు 2డి షోలు మొత్తం 4.30 లక్షల టిక్కెట్లు అంతకంటే ఎక్కువ అమ్ముడయ్యాయి.

మలయాళ 2డి షోలు మంగళవారం వరకు మొత్తం 87,361 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు సలార్ హిందీ అడ్వాన్స్ బుకింగ్ సుమారు 63,746 టిక్కెట్లు. తమిళంలో సుమారు 34,809 టిక్కెట్లు, కన్నడలో 8,216 టిక్కెట్లు అమ్ముడ‌య్యాయి. సలార్ 22 డిసెంబర్ 2023న విడుదలవుతోంది. ప్ర‌భాస్ `సలార్`లో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ సంవత్సరం భారతదేశంలోనే అతిపెద్ద చిత్రాలలో ఒకటి. అంతర్జాతీయ మార్కెట్‌లో చెప్పుకోదగ్గ వృద్ధిని కనబరుస్తున్న నేపథ్యంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్ పాజిటివ్‌గా ఉంది. కానీ డంకీతో ఎదురైన స‌మ‌స్య ఇప్పుడు స‌లార్ ఓపెనింగుల‌పై భారీ ప్ర‌భావం చూపనుంది.

Exit mobile version