Rajamouli:`స‌లార్‌` టీమ్‌తో రాజ‌మౌళి..జ‌క్క‌న్న ఏమ‌న్నారంటే..

Rajamouli:మ‌రి కొన్ని గంట‌ల్లో `స‌లార్‌` థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ప్ర‌భాస్ న‌టించిన ఈ భారీ యాక్ష‌న్ డ్రామా కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆయ‌న అభిమానులు, సినీ ల‌వ‌ర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబ‌ర్ 22న ఈ చిత్రాన్ని రికార్డు స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`, `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` వంటి సంచ‌ల‌న చిత్రాల‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ప్ర‌శాంత్ నీల్ ఈ సారి ప్ర‌భాస్‌తో క‌లిసి సినిమా చేయ‌డంతో అంద‌రి దృష్టి `స‌లార్‌`పై ప‌డింది.

ఇటీవ‌లే సినిమా ప్ర‌మోష‌న్స్‌కు శ్రీ‌కారం చుట్టిన మేక‌ర్స్ తాజాగా స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి హోస్ట్‌గా `స‌లార్‌` టీమ్ ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ల‌పై స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూని షూట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని తాజాగా విడుద‌ల చేశారు. జ‌క్క‌న్న ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌ల‌తో సాగిన తాజా ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ప్ర‌భాస్‌ సినిమాకు తొలి సారి `ఏ` సర్టిఫికెట్‌, ప్ర‌భాస్ క‌టౌట్ పై రాజ‌మౌళి అడిగిన ప్ర‌శ్న‌లు, వాటికి ప్ర‌శాంత్ నీల్ చెప్పిన స‌మాధానాలు ఆక‌ట్టుకుంటున్నాయి.

ఈ ఇంట‌ర్వ్యూ చూసిన ఫ్యాన్స్ జ‌క్క‌న్న‌, ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్‌ల‌పై కామెంట్‌లు చేస్తున్నారు. `ప్ర‌భాస్ అలా నిలుచుంటే చాలు ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అవుతాం. అలాంటి ప్ర‌భాస్‌తో `స‌లార్‌` చేశార‌ని రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌ని ప్ర‌శ్నించారు. దీనికి ఆయ‌న స‌మాధానం చెబుతూ `ఈ సారి చాలా డ్రామాని ప్ర‌య‌త్నించాన‌ని, అది మీలాంటి ద‌ర్శ‌కుల నుంచి నాకు గిఫ్ట్‌గా వ‌చ్చింద‌ని, రెండు మూడు క్యారెక్ట‌ర్ల‌తో ఏ స్థాయిలో ఎమోష‌న‌ల్ డ్రామాని పండించ‌వ‌చ్చో మీ నుంచి నేర్చుకున్నాను. ఈ సినిమాలోనూ దాన్నే ప్ర‌ధానంగా తీసుకుని ఈ సినిమాని తెర‌కెక్కించాను అన్నారు.

అయితే ట్రైల‌ర్‌లో మాత్రం ఆ డ్రామాని చూపించ‌డంలో మాత్రం ఫెయిల్ అయ్యానని తెలిపారు. నేను ప్ర‌భాస్‌, పృథ్వీరాజ్ సార్‌ల‌కు ఏదైతే స్టోరీ చెప్పానో అదే స్క్రీన్‌పైకి తీసుకొచ్చాను. అయితే ప్ర‌భాస్ లాంటి బిగ్ హీరో సినిమాకు `ఏ` స‌ర్టిఫికెట్ రావ‌డం ఎలా చూస్తార‌ని, ప్ర‌భాస్‌ను ఇష్ట‌ప‌డే పిల్ల‌ల‌కు ఏం చెబుతార‌న్నారు. అంతే కాకుండా శృతిహాస‌న్‌, ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో ఒక్క పాట లేక‌పోవ‌డంతో నేను అప్సెట్ అయ్యాన‌ని జ‌క్క‌న్న అన్నారు. ఇంకా ఈ ఇంట‌ర్వ్యూలు రాజ‌మౌళి ప‌లు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు వేశారు. వాటికి ప్ర‌శాంత్ నీల్‌, ప్ర‌భాస్‌, పృథ్వీరాజ్ సుకుమారన్ స‌మాధానాలు చెప్పారు. అవేంటే మీరూ ఓ లుక్కేయండి.

TAGS