కానీ నైజాం ప్రాంతం లో మాత్రం దాదాపుగా 70 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి #RRR మరియు బాహుబలి సినిమాల తర్వాత 70 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన సినిమాగా నిల్చింది సలార్. అలాగే ఓవర్సీస్ లో కూడా దాదాపుగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రాజమౌళి సినిమాలు తప్ప మన తెలుగు నుండి ఓవర్సీస్ లో ఇంత వసూళ్లను రాబట్టిన సినిమానే లేదు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ఓటీటీ విడుదల తేదీ ఎప్పుడూ అని అడుగుతూనే ఉన్నారు. జనవరి 26 వ తారీఖున విడుదలయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి 26 వ తేదీన విడుదల కావడం లేదట.
ఫిబ్రవరి 4 వ తేదీన తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళం భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు సమాచారం. అయితే ఓటీటీ వెర్షన్ లో అదనపు సన్నివేశాలను జత చేసి విడుదల చేయబోతున్నారట. రీ షూటింగ్ సమయం లో తీసిన కొన్ని సన్నివేశాలతో పాటుగా ఒక ఐటెం సాంగ్ ని కూడా జత చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్.