JAISW News Telugu

Salaar on Netflix : నేటి అర్థ రాత్రి నుండే నెట్ ఫ్లిక్స్ లోకి ‘సలార్’..ఫ్యాన్స్ కి పండగే!

Salaar on Netflix

Salaar on Netflix

Salaar on Netflix : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి రికార్డు స్థాయి ఓపెనింగ్ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. మొదటి వారం లోనే 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లకు అతి దగ్గరగా వచ్చిన ఈ సినిమా కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందని అందరూ అనుకున్నారు.

కానీ ఈ సినిమా చివరికి 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై 620 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ‘జైలర్’ , ‘లియో’ చిత్రాలకంటే తక్కువ వసూళ్లను రాబట్టడం కాస్త టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను నిరాశ పర్చింది. ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ తక్కువగా థియేటర్స్ కి రావడం వల్లే లాంగ్ రన్ రాలేదని, ఓవరాల్ బిజినెస్ పరంగా కూడా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వలేదని, 20 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇకపోతే ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. ఓటీటీ విడుదల కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, జనవరి 26 వ తేదీన అన్నీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా, ఫిబ్రవరి నాల్గవ తేదికి వాయిదా పడిందని, రీసెంట్ గానే ఒక రూమర్ సోషల్ మీడియా లో బాగా ప్రచారం అయ్యింది. దీంతో నిరాశ చెందిన అభిమానులు నేడు అర్థ రాత్రి 12 గంటలకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది అంటూ వచ్చిన వార్త చూసి ఆశ్చర్యపోయారు. ఇదేంటి నిన్న మొన్నటి వరకు ఆలస్యం గా స్ట్రీమింగ్ అవుతుంది అనుకున్న ఈ చిత్రం ఇప్పుడు అకస్మాత్తుగా తొందరగా విడుదల అయిపోతుంది అని అనుకున్నారు.

మేకర్స్ తో ఏదైనా ఇంటర్నల్ డీలింగ్ జరిగిందా..?, ముందు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తం లో డబ్బులు ఇస్తామని చెప్పడం తో ముందుగా విడుదల చేస్తున్నారా వంటి సందేహాలు వ్యక్తపరుస్తున్నారు ఫ్యాన్స్. థియేటర్స్ లో చూడకుండా, ఓటీటీ లో వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకున్న ఆడియన్స్ సంఖ్య లాక్ డౌన్ తర్వాత బాగా పెరిగారు. వాళ్లకు నేడు పండగే అని చెప్పొచ్చు. తెలుగు తో పాటుగా హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.

Exit mobile version