JAISW News Telugu

Gunturkaaram Vs Salaar : ‘గుంటూరు కారం’ థియేటర్స్ ని రీప్లేస్ చేస్తున్న ‘సలార్’..

Gunturkaaram Vs Salaar

Salar is replacing Guntur Kaaram Theatres

Gunturkaaram Vs Salaar : గత ఏడాది డిసెంబర్ 22 వ తారీఖున భారీ అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం ‘సలార్’ బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఓపెనింగ్స్ లో అంచనాలను అయితే అందుకుంది కానీ, లాంగ్ రన్ లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని అనుకుంటే కేవలం 600 కోట్ల రూపాయలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అయితే ఇప్పటికీ ఈ చిత్రం పలు థియేటర్స్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర, హైదరాబాద్ మరియు ఇతర తెలంగాణ జిల్లాల్లో లిమిటెడ్ షోస్ తో ఈ సినిమా కొత్త చిత్రాలు వచ్చినప్పటికీ ఆడుతూనే ఉంది. ఇప్పుడు ఆ లిమిటెడ్ షోస్ ని కాస్త పెంచే ప్రయత్నం లో ఉన్నారు బయ్యర్స్. ఎందుకంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాల్సిన సెంటర్స్ చాలానే ఉన్నాయి. ఈ పండగ సెలవుల్లో బ్రేక్ ఈవెన్ కొట్టే ఛాన్స్ ఉన్నా లేకపోయినా కొంత వరకు రికవర్ అవ్వగలం అనేది బయ్యర్స్ ఆశ.

అందుకే అదనపు షోస్ ని గణనీయంగా పెంచుతున్నారు. దానికి తోడు ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిల్చింది. కొన్ని బీ,సి సెంటర్స్ లో ఈ సినిమా పండగ సేవలను కూడా ఉపయోగించుకోలేకపోతుంది. షోస్ ఫుల్ అవ్వకపోవడం తో ‘గుంటూరు కారం’ సినిమాని థియేటర్స్ నుండి తొలగించి సలార్ చిత్రాన్ని వేసుకున్నారు. అలా చాలా చోట్ల జరిగింది. దీంతో ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలి అని అనుకున్న వాళ్ళు ఛాన్స్ మిస్ అవ్వకుండా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తున్నారు. కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి కూడా. అలా సలార్ చిత్రం సంక్రాంతి సెలవుల్లో కూడా సత్తా చూపిస్తూ ముందుకు దూసుకుపోతుంది.

మరి బ్రేక్ ఈవెన్ అవ్వాల్సిన సెంటర్స్ కాస్త అయినా రికవరీ అవుతుందో లేదో చూడాలి. ఇకపోతే ప్రభాస్ ఈ చిత్రం తర్వాత ‘కల్కి 2898AD’  అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది మే 9 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాతో పాటుగా ఆయన మారుతీ తో మరో సినిమా చేస్తున్నాడు. అది కూడా ఈ ఏడాదే విడుదల కాబోతున్నట్టు సమాచారం.

Exit mobile version