Salaar Director : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం గత ఏడాది డిసెంబర్ 22 వ తారీఖున విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి ప్రభాస్ కెరీర్ లో బాహుబలి సిరీస్ తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాగా నిల్చింది. ప్రశాంత్ నీల్ టేకింగ్ కి, ప్రభాస్ మాస్ కటౌట్ కి జనాలు నీరాజనం పలికారు. వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కచ్చితంగా అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు కానీ, ఎందుకో ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించలేదు.
మితిమీరిన వియోలెన్స్ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించరు అనడానికి ‘సలార్’ చిత్రం ఒక ఉదాహరణగా నిల్చింది. అయితే ఈ సినిమా ఓటీటీ లో విడుదలైనప్పుడు మాత్రం ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. #RRR మూవీ ని హాలీవుడ్ ఆడియన్స్ ఎలా అయితే ఆదరించారో, ఇప్పుడు ‘సలార్’ చిత్రానికి కూడా అలాంటి ఆదరణే దక్కుతుంది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రశాంత్ నీల్ మొదటి చిత్రం ‘ఉగ్రం’ కి రీమేక్ గా తెరకెక్కింది అని సోషల్ మీడియా లో అప్పట్లో తెగ ప్రచారం సాగింది. ఇదే విషయాన్ని ప్రశాంత్ నీల్ వద్ద ప్రస్తావించగా, ఆయన దానికి సమాధానం చెప్తూ ‘ ఉగ్రం సినిమా కూడా నాదే..నేను నా స్టోరీ ని మరోసారి గ్రాండ్ వే లో చెప్పాలని అనుకుంటున్నాను, అందులో తప్పేమి ఉంది. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఏమని అనుకుంటున్నారు అనేదే నాకు కావాలి.
ఒక సినిమా ని పోలిన విధంగా మరో సినిమా ఉండడం మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో కొత్తేమి కాదు. కేవలం స్క్రీన్ ప్లే, టేకింగ్ విషయం లోనే ప్రతిభ చూపిస్తేనే జనాలు ఆదరిస్తారు. నా సలార్ చిత్రాన్ని కూడా అలాగే ఆదరించారు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని ప్రశాంత్ నీల్ మరోసారి ఖరారు చేసాడు. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది అట. సీక్వెల్ మొదటి పార్ట్ కంటే ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందని, ఆడియన్స్ థ్రిల్ అయ్యే ఫాక్టర్స్ అన్నిటికీ ఈ సినిమాలో సమాధానం దొరుకుతుందని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్.