Salaar:అత్యంత భారీ అంచనాల నడుమ పాన్-ఇండియన్ చిత్రం సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్ ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ప్రభాస్ కథానాయకుడిగా, పృథ్వీరాజ్ కీలక పాత్రలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించింది. డంకీ, ఆక్వామేన్ 2 లాంటి చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో సలార్ పైనే కళ్లన్నీ. ఈ సినిమా హిట్టు అన్న టాక్ వచ్చినా బంపర్ కలెక్షన్లతో సునామీ సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి కాసేపట్లో సలార్ సమీక్షలు వెలువడనున్నాయి.
ఇంతలోనే ఈ సినిమాని ఫలానా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని కథనాలొస్తున్నాయి. అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సలార్ కోసం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అత్యంత భారీ మొత్తాన్ని వెచ్చించి దక్కించుకున్నట్లు తాజా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి ఉన్న హైప్ దృష్ట్యా మెజారిటీ ప్రజలు థియేటర్లలో వీక్షించే వీలుంది.
ఓటీటీలో రిలీజవ్వాలంటే కనీసం 50 రోజుల గ్యాప్ అవసరమవుతుంది. అంటే.. ఫిబ్రవరి చివరిలో లేదా మార్చిలో ఓటీటీలోకి వచ్చే వీలుంటుంది. బ్లాక్ బస్టర్ టాలీవుడ్ సినిమాల రైట్స్ ని ఛేజిక్కించుకుంటూ ఓటీటీ రంగంలో ఠఫ్ కాంపిటీషన్ ఇస్తోంది నెట్ ఫ్లిక్స్. ఇప్పుడు సలార్ లాంటి క్రేజ్ ఉన్న సినిమాని ఛేజిక్కించుకుని సంచలనం సృష్టిస్తోంది.
సలార్‌లో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమరన్, టిను ఆనంద్, జగపతి బాబు, ఈజీ రావు, బాబీ సింహా తదితరులు నటించారు. రవి బస్రుర్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది.