Salaar Closing Collections : ‘సలార్’ క్లోసింగ్ కలెక్షన్స్..1000 కోట్లు రాబడుతుంది అనుకుంటే కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు!
Salaar Closing Collections : ప్రభాస్ హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ కాంబినేషన్ చిత్రం ‘సలార్’ గత ఏడాది డిసెంబర్ 22 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషలో గ్రాండ్ గా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఓపెనింగ్స్ కి టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు దద్దరిల్లింది.
కేవలం మొదటి వారం లోనే 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మన టాలీవుడ్ లో స్టార్ హీరోల కెరీర్ హైయెస్ట్ వసూళ్లను మొత్తం దాటేసి, నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ అవ్వడానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే పట్టింది. ఓపెనింగ్స్ మాత్రం నిజంగా డైనోసార్ కి ఆకలేస్తే ఎలా వేటాడుతుందో, అదే రేంజ్ లో ‘సలార్’ వేట ఉన్నింది. కానీ లాంగ్ రన్ మాత్రం అనుకున్న రేంజ్ లో కనీసం స్థాయిని కూడా అందుకోలేక ట్రేడ్ ని నిరాశ పర్చింది.
ఎందుకంటే వచ్చిన టాక్ కి, ఓపెనింగ్స్ కి కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొడుతుందని ట్రేడ్ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ఈ సినిమా కేవలం 600 కోట్ల రూపాయిలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నైజాం ప్రాంతం లో తప్ప, ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్స్ ఒక్క చోట కూడా బ్రేక్ ఈవెన్ పొందలేదు. ఓవరాల్ గా అన్నీ ప్రాంతాలకు కలిపి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే దాదాపుగా 350 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. కానీ ఈ చిత్రం కేవలం 310 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. అంటే దాదాపుగా 40 కోట్ల రూపాయిల నష్టం వచ్చింది. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ లాంటి కాంబినేషన్ మూవీ కి పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ వసూళ్లు రావాలి ?, కానీ ఆ రేంజ్ ని అందుకోవడం లో మాత్రం ఈ సినిమా విఫలం అయ్యింది.
పార్ట్ 1 అనుకున్న టార్గెట్ ని అయితే కచ్చితంగా రీచ్ కాలేదు, మరి పార్ట్ 2 తీస్తారా?, తీసినా ఆ చిత్రానికి హైప్ తీసుకొని రాగలరా అంటే అనుమానమే. మంచి ఊపులో ఉన్నప్పుడు మధ్యలో ఆపిన సినిమాలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ మూవీ క్లైమాక్స్ ని ముగిస్తాడు. అలాంటప్పుడు పార్ట్ 2 చెయ్యకపోతే ‘సలార్’ మూవీ ని ఇష్టపడే వాళ్ళు ఫీల్ అవుతారు, ఏమి చేస్తారో చూడాలి.