Bigg Boss 7 Telugu:బిగ్‌బాస్ సీజన్ తెలుగు విజేతను ప్రకటించిన సందర్భంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మండిపడ్డారు. బస్సులపై దాడికి సంబంధించిన మా సిబ్బంది ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీస్టేషన్‌లో కేసునమోదు చేశారన్నారు. `అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి మంచివి కావన్నారు. ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం అంటే సమాజంపై దాడి చేసినట్లే అవుతుంది.
ఇలాంటి సంఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించదు. ఆర్టీసీ బస్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది` అన్నారు. ఆదివారం అర్థ్రరాత్రి బిగ్‌బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అని తెలియగానే అతడి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రన్నరప్‌గా నిలిచిన అమర్, విజేతగా నిలిచిన ప్రశాంత్ అభిమానుల మధ్య మొదలైన వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. ఒకరిని ఒకరు అసభ్య పదజాలంతో దుర్భాషలాడుకున్నారు. కృష్ణా నగర్ వద్ద ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. ఇదే క్రమంలో కొంత మంది అమర్ దీప్ వెళుతున్న కారు అద్దాలని కూడా ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇదేం అభిమానం!
బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023