JAISW News Telugu

Sajjala Ramakrishna : ఎట్టకేలకు ఓటమిని ఒప్పుకున్న సజ్జల

Sajjala Ramakrishna

Sajjala Ramakrishna

Sajjala Ramakrishna : మాజీ సీఎంకు అన్నీ తానై దగ్గరుండి జ‌గ‌న్ పాల‌న‌లో చ‌క్రం తిప్పిన స‌జ్జల రామకృష్ణా రెడ్డి.. ఎన్నిక‌ల్లో తమ పార్టీ ఓట‌మి త‌ర్వాత మీడియా ముందు పెద్దగా క‌నిపించ‌లేదు. ఓట‌మిపై జ‌గ‌న్ నుంచి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఎమ్మెల్యేల వ‌ర‌కు త‌లో మాట మాట్లాడుతూ వ‌చ్చారు. త‌మ హయాంలో జరిగిన సంక్షేమాన్ని చెప్పుకుంటూ..  వారి ప్రేమ ఏమైందో అని జ‌గ‌న్ నిర్వేదంతో పాటు ఈవీఎంల‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సజ్జల ఓటమిని అంగీకరించారు. ప్రజల తీర్పుగానే భావిస్తున్నామ‌ని ఓట‌మిని ఒప్పుకున్నారు. వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఆయన మాట్లాడుతూ.. ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు.  వైఎస్‌ఆర్‌ ఆశయ సాధనకు వైఎస్‌ జగన్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం. ప్రజల తీర్పును గౌరవిస్తాం. అసాధ్యమైన వాగ్దానాలతో ప్రత్యర్థులను మభ్యపెడుతున్నారు. వైఎస్ జగన్ హామీలు ఇచ్చి మోసం చేయలేరని, ప్రజలను భ్రమల్లో ఉంచారన్నారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా జగన్ పాలన సాగించారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. వైయస్ జగన్ ఇండ్ల ముందు పరిపాలనను తీసుకొచ్చారు. అందరం కలిసి ముందుకు సాగుదాం. చంద్రబాబు ప్రభుత్వం హామీలు అమలు చేయకుంటే అడ్డుకుంటాం. రాష్ట్రానికి, ప్రజలకు ఏ సమస్య వచ్చినా వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. పోరాటానికి ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.  వైఎస్ కు అసలైన రాజకీయ వారసుడు జగనేనని పరోక్షంగా షర్మిలకు కౌంటర్ ఇచ్చారు.

Exit mobile version