JAISW News Telugu

Jagan-Sajjala : జగన్ కు సజ్జల ఓ ఆస్తి..ఆయన కన్విన్స్ చేస్తే ఇక అంతే!

Jagan-Sajjala

Jagan-Sajjala

Jagan-Sajjala : సీఎం జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ఆస్తి అనే చెప్పవచ్చు. సీనియర్ జర్నలిస్ట్ కావడంతో ఏలాంటి క్లిష్టమైన అంశాన్నైనా తేలికగా, స్పష్టంగా క్లియర్ చేస్తారు. జగన్ సర్కార్ కు విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు ముందుకొచ్చేది సజ్జలనే. ప్రతిపక్షాల విమర్శలకు హోరుమని పెద్దగొంతుతో ఎడపెడ తిట్టుకుంటూ కాకుండా కన్విన్స్ గా చెప్పేసి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేస్తారు. అందుకే సజ్జలనే ముందుపెడుతారు.

గతంలో ఓపీఎస్(పాత పెన్షన్ విధానం) అమలు చేయాలని ఉద్యోగులు ఆందోళన చేస్తే దీన్ని సజ్జల చాలా తేలికగా కన్విన్స్ చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా మరోమాట మాట్లాడలేకపోయాయి. ‘‘ఓపీఎస్ అమలు చేద్దామనుకున్నాం.. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల సీపీఎస్ స్థానంలో జీపీఎస్ ను అమలు చేస్తున్నాం. దీనికి ఉద్యోగులు సహకరించాలి..ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలి’’ అని ఒక్క మాటలో తేల్చేశారు. సజ్జల కౌంటర్ కు ప్రతిపక్షాలు తాము అధికారంలోకి వస్తే ఓపీఎస్ అమలు చేస్తామని కూడా హామీ ఇవ్వలేకపోయాయి. ఇక దీంతో ఉద్యోగులు ఆందోళన విరమించాయి.

ఇక తాజాగా మద్యపాన నిషేధం అమలుపై సజ్జల అలాంటి కామెంట్స్ చేశారు. ‘‘మద్యపాన నిషేధం అమలు చేద్దామని అనుకున్నాం. కానీ ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక సమస్యలతో దశల వారీగా ముందుకు వెళ్తున్నాం. అందుకే బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తివేశాం. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైన్స్ షాపులు నిర్వహిస్తున్నాం. గతంలో ఉన్న షాపులను సగానికి పైగా తగ్గించాం. లిక్కర్ ధరలు భారీగా పెంచాం. క్రమేణా లిక్కర్ ను జనాలకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో సుమారు 16వేల కోట్ల ఆదాయం వస్తే..ఇప్పుడు 26వేల కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. రాష్ట్రంలో వివిధ పథకాల అమలు కోసం కొనసాగించకతప్పడం లేదు.’’ అంటూ తేల్చేశారు.

కాగా, మద్యపాన నిషేధంపై సజ్జల క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ప్రతిపక్షాలు తాము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పకపోవడం గమనార్హం. ఈ విషయంలో వారు నిషేధిస్తామని చెప్పకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టే అవుతుంది. అందుకే జగన్ కు సజ్జల ఓ ఆస్తి అని చెప్పవచ్చు.

Exit mobile version